రాష్ట్రీయం

రుచిత సాహసం నిరుపమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జనవరి 24: ఏటా సాహస బాలలకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక గీతా చోప్రా అవార్డు దక్కించుకున్న మెదక్ జిల్లా బాలిక రుచిత కనబరచిన ధైర్య సాహసాలు నిరుపమానం. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల రుచిత కనబరిచిన తెగువ మరో ఇద్దరు బాలలకు ప్రాణభిక్ష పెట్టింది. ఇంతకీ రుచిత చేసిన సాహసమేమిటి? 2014 జూలై 24వ తేదీ ఉదయం 8.30 గంటలకు తూప్రాన్ పట్టణంలోని కాకతీయ టెక్నో స్కూల్ బస్సు వెల్దుర్తి మండలం మాసాయిపేట గ్రామం వద్ద కాపలాలేని రైల్వే క్రాసింగ్ గేటు దాటుతున్న క్రమంలో సికింద్రాబాద్-మన్మాడ్ పాసింజర్ రైలు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో 16 మంది విద్యార్థులు, బస్సు డ్రైవర్, క్లీనర్ మృత్యువాత పడ్డారు. స్వల్ప గాయాలతో బతికి బయటపడిన రుచిత బస్సులో ఇరుక్కుపోయిన సాత్విక్, మహిపాల్‌రెడ్డి అనే తోటి విద్యార్థులను గమనించి బలం కూడదీసుకుని వారిని బస్సు కిటికీలోంచి బయటకు నెట్టివేసింది. తానూ బయటపడింది. ఆ ఇద్దరు విద్యార్థులు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వాస్తవానికి అప్పటికే గుండెజబ్బుతో రుచిత బాధపడుతోంది. మందులు తీసుకుంటోంది. అయినప్పటికీ ఆమె ఇంతటి ధైర్యాన్ని కనబరచడం విశేషం.