రాష్ట్రీయం

రోహిత్ ఆత్మహత్యపై చాలా అనుమానాలున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌యుసి)లో విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని ఎబివిపి హెచ్‌సియు విభాగం డిమాండ్ చేసింది. అతని ఆత్మహత్యపై చాలా అనుమానాలున్నాయన్నారు. యూనివర్శిటీలోని టీచర్స్ అసోసియేషన్‌కు చెందిన ప్రొఫెసర్ల కాల్‌డేటాపైనా సిబిఐతో విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు. ఎబివిపి హెచ్‌సియు అధ్యక్షుడు నందనం సుశీల్‌కుమార్ బుధవారం నాడిక్కడ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలోమాట్లాడారు. హెచ్‌సియులో జాతి వ్యతిరేక చర్యలు కొనసాగుతున్నాయని, అదేవిధంగా నక్సలిజం, కమ్యూనిజం భావజాలాన్ని బోధించడం తప్ప పాఠాలు బోధించే పరిస్థితి లేదని ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్యకు ఎబివిపికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు.
హెచ్‌సియులో దేశ ద్రోహులను సమర్ధించే కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఆ క్రమంలోనే యాకుబ్ మెమెన్‌కు మద్దతుగా సంతాపసభలు నిర్వహించడంపై ఫేస్‌బుక్‌లో అభ్యంతరం వ్యక్తం చేసినందుకు గాను కొందరు తనపై అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో దాడి చేశారని తెలిపారు. తాను చావుబ్రతుకుల మధ్య ఆసుపత్రిపాలయ్యానని అన్నారు. విసిని కలిసేందుకు తల్లితో కలిసి వస్తుంటే ఎఎస్‌ఏ కార్యకర్తలు బూతులు తిడుతూ, దాడి చేసే ప్రయత్నం చేశారని సుశీల్‌కుమార్ వెల్లడించారు. తొలిసారి విచారణ కమిటీ నివేదిక రాగానే ఆ ఐదుగురిపై సస్పెన్షన్ విధించారని, రెండోసారి కమిటీ విచారణకు హాజరై తన వంతు సమాచారం అందించానని సుశీల్ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకే చర్యలు తీసుకున్నారు తప్ప ఏకపక్షంగా కాదని స్పష్టం చేశారు. దీనిలో కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయల ప్రమేయం ఎంత మాత్రం లేదని అన్నారు. కేవలం హాస్టల్ వసతి మాత్రమే తగ్గించారు తప్ప అంతకు మినహా చర్యలు తీసుకోలేదని వివరించారు.