రాష్ట్రీయం

రోహిత్ మృతిపై రాష్టవ్య్రాప్త ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: సెంట్రల్ యూనివర్శిటీలో దళిత విద్యార్థి వేముల రోహిత్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ గురువారం నగరంలోని బాగ్‌లింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌వెస్లీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 173 సంఘాలతో ‘రోహిత్ సాలిడారిటీ అండ్ స్ట్రగుల్ కమిటీ’ ఏర్పడింది. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ కాకి మాధవరావు.. జస్టిస్ (రిటైర్డ్) చంద్రకుమార్‌ను కన్వీనర్‌గా ప్రతిపాదించగా సమావేశం ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, కోదండరాం, కె.నాగేశ్వర్, భంగ్యా భూక్యలతో పాటు సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రముఖ గాయకుడు జయరాజు ప్రసంగించారు. ఈ సందర్భంగా కమిటీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ప్రకటించింది. ఈ నెల 22న కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని, 23న ఇందిరాపార్కు వద్ద రిలే దీక్షలు చేపట్టాలని, 24న జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించాలని, 25న చలో హెచ్‌సియు కార్యక్రమాన్ని చేపట్టాలని కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశంలో ముందుగా రోహిత్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు వౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సమావేశంలో విద్యార్థి, యువజన, ప్రజాసంఘాలతో పాటు అన్ని వామపక్షాలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. అయితే బిజెపి, టిడిపి, టిఆర్‌ఎస్ పార్టీల నాయకులు ఎవరూ ఈ సమావేశంలో పాల్గొనలేదు.