తెలంగాణ

రాజీవ్ శర్మ పదవీ కాలం పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: ఈ నెలాఖరున పదవీ విరమణ పొందనున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పదవీకాలాన్ని మరో మూడు నెలలపాటు పొడిగించినట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి శుక్రవారం ఉత్తర్వులు అందాయి. కేంద్ర మంత్రిత్వశాఖ డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డివోపిటి) నుంచి ఈ ఉత్తర్వులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు అందాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రూపొందించిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే గ్రౌండ్ అవుతున్నాయని, వీటి రూపకల్పనలో రాజీవ్ శర్మ క్రియాశీలక పాత్ర పోషించడంతో ఆయన పదవీకాలాన్ని ఆరు నెలల పాటు పొడిగించాల్సిందిగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కేంద్రానికి లేఖ రాశారు. ఈ మేరకు రాజీవ్ శర్మ పదవీకాలాన్ని మూడు నెలలపాటు పొడిగిస్తూ డివోపిటి నుంచి ఉత్తర్వులు అందాయి. అయితే ముఖ్యమంత్రి ఆరు నెలలు పొడిగించాలని కోరగా, మూడు నెలలు మాత్రమే పొడిగించింది.