రాష్ట్రీయం

జూన్‌నాటికి ఆర్‌అండ్‌బి, రవాణాశాఖ ఆఫీసుల తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,డిసెంబర్ 31: గ్రామస్థాయి నుండి మండల, జిల్లావరకు, జిల్లాల నుండి అమరావతి రాజధాని వరకు రహదారులను సర్వాంగ సుందరంగా తయారుచేయటమే తమముందున్న ప్రధానలక్ష్యమని రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. గురువారం రాత్రి తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రహదారులను అభివృద్ధి చేసేందుకు ఈనాటి వరకు 1904కోట్లరూపాయలు ఖర్చుపెట్టామన్నారు. జాతీయ రహదారులను అమరావతి రాజధానికి అనుసంధానం చేస్తూ కేంద్రరవాణాశాఖమంత్రి నితిన్‌గడ్కారి 75వేల కోట్లరూపాయలను ప్రకటించారన్నారు. ప్రధాన రహదారులతోపాటు ఔటర్‌రింగ్‌రోడ్లకు సంబంధించి మరో 25వేలకోట్లరూపాయలను కేంద్రం ప్రకటించిందన్నారు. ప్రధానంగా రహదారులను డిఒటి,పిపిపి, యాంగ్జిటి పద్ధతిలో నిర్మిస్తామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నూతనంగా రహదారులు వేసిన ప్రాంతంలో ధర్డ్‌పార్టీతో పూర్తిస్థాయిలో సర్వేచేయిస్తున్నట్లు తెలిపారు. ఆ సర్వేలో నాణ్యతలో తేడావచ్చినా, అవినీతి జరిగినట్లు రుజువైతే కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టి అందుకు సంబంధించిన అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.