తెలంగాణ

రైలుకు ఎదురెళ్లి యువతి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వేస్టేషన్ సమీపంలో ఇరవై సంవత్సరాల యువతి రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రైలు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి రైలు ఆమెకు సమీపంలోకి రాగానే ఆపివేయటంతో ఆ యువతి ప్రాణాలతో బయటపడింది. మంగళవారం శాతవాహన ఎక్స్‌ప్రెస్ కేసముద్రం రైల్వేస్టేషన్‌కు వచ్చింది. స్థానిక ఎర్రగడ్డ కాలనీకి చెందిన యువతి ఆ ఎక్స్‌ప్రెస్‌కు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎరుపు రంగు దుస్తులు ధరించి ఉండటంతో డ్రైవర్ గుర్తించి వెంటనే రైలును నిలిపివేశాడు. ప్రయాణీకులు, డ్రైవర్లు ఆమెను సముదాయించి తల్లిదండ్రులకు అప్పగించారు.