రాష్ట్రీయం

నేటి నుండి రాజమహేంద్రవరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డివిజన్, మండల స్థాయి అధికారులకు ఆదేశాలు * అన్ని కార్యాలయాల్లో పేరు మార్పు

కాకినాడ, డిసెంబర్ 31: తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి నగరాన్ని రాజమహేంద్రవరంగా మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రతులు సంబంధిత అధికారులకు చేరాయి. ఈ మేరకు రాజమండ్రి నగర పాలక సంస్థ అధికారులు, సబ్ కలెక్టర్, డివిజన్ అధికారులు, మండల తహసీల్దార్లకు జిల్లా కలెక్టరేట్ నుండి గెజిట్ నోటిఫికేషన్ ప్రతులు పంపినట్టు జిల్లా రెవెన్యూ అధికారి బి యాదగిరి ఆంధ్రభూమి ప్రతినిధికి గురువారం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజమహేంద్రవరంగా పేరు మారుస్తూ ఇచ్చిన ఆదేశాలను జిల్లాలో ప్రతి ఒక్కరు జనవరి 1 నుండి తప్పనిసరిగా పాటించాల్సి ఉంది. ఇకపై అన్ని రకాల వ్యవహారాలను, ఉత్తర ప్రత్యుత్తరాలను, దస్త్రాల్లోను రాజమహేంద్రవరంతోనే జరపాల్సి ఉంటుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలపై రాజమండ్రికి బదులు రాజమహేంద్రవరంగా పేర్లు మార్చే బాధ్యతలను నగర పాలక సంస్థ అధికారులు చూడాల్సి ఉంది. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు సహా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై పేరు మార్చాల్సి ఉంది. వాస్తవానికి ఒకపుడు రాజమండ్రి అసలు రాజమహేంద్రి. రాజరాజ నరేంద్రుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించడంతో రాజమహేంద్రిగా పిలిచేవారు. ఆంగ్లేయుల పాలన ఆరంభమైన తరువాత వారి సౌలభ్యం కోసం కాలక్రమంలో రాజమహేంద్రి కాస్తా రాజమండ్రిగా మారింది. 2015 గోదావరి మహా పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చుతున్నట్టు ప్రకటించారు. అయితే ఇందుకు సంబంధించి రాజమండ్రి నగర పాలక సంస్థలో ఏ విధమైన తీర్మానం జరుగకుండా నగరం పేరును ఎలా మార్చుతారంటూ పలువురు విమర్శలు కూడా చేశారు.