ఆంధ్రప్రదేశ్‌

పోలీస్ వ్యాన్ దిగేది లేదు:ముద్రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: తుని విధ్వంసకాండకు సంబంధించి అరెస్టు చేసిన వారిని విడిచిపెట్టేంత వరకూ తాను పోలీస్ వ్యాన్ దిగేది లేదని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పట్టువీడక పోవడంతో కిర్లంపూడిలో ఉద్రిక్తత ఏర్పడింది. అమలాపురం నుంచి ఆయనను సిఐడి పోలీసులు కిర్లంపూడికి వ్యాన్‌లో తీసుకుని వచ్చారు. ఇంటి వద్ద ఆయనను విడిచిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నించినా వ్యాన్ దిగేందుకు ముద్రగడ నిరాకరించారు. ఆయన ఇంటికి తాళం వేసి గేటు వద్ద వాహనాలను అడ్డంగా నిలిపారు. దీంతో ఏం చేయాలో తోచక పోలీసులు ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నారు. ముద్రగడను బలవంతంగా వ్యాన్‌లో నుంచి దింపేసి రోడ్డుపైన కూర్చోబెడితే పరిస్థితులు ఎలా ఉంటాయోనని పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు. జిల్లా ఎఎస్పీ కిర్లంపూడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.