తెలంగాణ

ఆస్పత్రి వద్ద రమ్య బంధువుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పంజగుట్ట వద్ద రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మరణానికి కారకులైన ఆరుగురు యువకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ చిన్నారి రమ్య కుటుంబ సభ్యులు సోమవారం యశోద ఆస్పత్రి వద్ద ఆందోళన ప్రారంభించారు. ఈనెల 1న పంజగుట్ట వద్ద మద్యం తాగి ఆరుగురు మైనర్ యువకులు కారు నడపడంతో మరో కారులో వెళుతున్న రమ్య కుటుంబీకులు గాయపడ్డారు. సంఘటన స్థలంలోనే రమ్య బాబాయి మరణించగా, 17 రోజులుగా చికిత్స పొందుతూ ఆమె తాత మధుసూదనాచారి సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలిస్తుండా ఆస్పత్రి వద్ద రమ్య బంధువులు ఆందోళన ప్రారంభించారు. ముగ్గురి మృతికి కారకులైన యువకులను కఠినంగా శిక్షించాలని, తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ సరిగా స్పందించలేదని వారు ఆరోపించారు. హోం మంత్రి ఆస్పత్రికి వచ్చి కచ్చితమైన హామీ ఇచ్చేంతవరకూ తాము కదిలే ప్రసక్తేలేదని వారు తెలిపారు. రమ్య బంధువుల ఆందోళనకు స్థానికులు కూడా మద్దతు తెలిపారు.