విజయనగరం

క్రిస్మస్ రేషన్ సరకుల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 25: పండుగ రోజులలో పేదల పస్తులతో ఉండకూడదనే ఉద్ధేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్రిస్మస్, చంద్రన్న సంక్రాంతి కానుకల పేరుతో రేషన్ సరుకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విఎస్ ప్రసాద్ అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నా ముఖ్యమంత్రి ఎంతో ధైర్యంతో రేషన్‌షాపుల ద్వారా సరుకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. కిస్మస్ సందర్భంగా 31వ వార్డు పరిధిలోని అలకానందకాలనీ రేషన్‌షాపులో కిస్మస్ రేషన్ సరకుల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ పేదవాడి చేతిలోడబ్బులు లేక క్రిస్మస్, సంక్రాంతి పండుగలు చేసుకోలేమన్న బాధ పడకూడన్న భావంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేదవాడి కళ్లలో ఆనందం చూడాలని క్రిస్మస్, చంద్రన్న సంక్రాంతి కానుకలను ఇస్తున్నారని తెలిపారు. రాష్టవ్రిభజన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పేదవాడి సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో 31వ వార్డు కౌన్సిలర్ కొర్నాన రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

వీరబ్రహ్మేంద్ర స్వామికి విశేషపూజలు
విజయనగరం, డిసెంబర్ 25: పట్టణంలోని బొండాడవీధిలో ఉన్న కామాక్షి సమేత ఏకాంబరేశ్వరస్వామి వారి ఆలయంలో శుక్రవారం వీరబ్రహ్మేంద్ర స్వామివారికి విశేషపూజలు నిర్వహించారు.వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ, సిద్దయ్య ఉత్సవ విగ్రహాలను అలంకరించి పూజలు జరిపారు. అష్టోత్తర శతనామావళి పారాయణం చేసారు. ఈసందర్భంగా కామాక్షి అమ్మవారికి వేకువజామున క్షీరాభిషేకం నిర్వహించారు. ప్రతినెలా పౌర్ణమి రోజున స్వామివారికి విశేషపూజలను జరుపుతారు. ఆలయ అర్చకుడు గంగాధరాచారి ఆధ్వర్యంలో భక్తులు పూజాకార్యక్రమాలు జరిపారు. ఆలయ చైర్మన్ సోమారాజు, వైస్‌చైర్మన్ శశిభూషణరావు పర్యవేక్షణ జరిపారు.

బరువు తక్కువగా చంద్రన్న సరుకులు
గజపతినగరం, డిసెంబర్ 25: ప్రభుత్వం ఉచితంగా తెలుపురేషన్ కార్డుదారులకు చంద్రన్న క్రిస్మస్‌తోపాటు సంక్రాంతి సరుకులను పంపిణి చేస్తున్నది. ముందుగా క్రైస్తవులకు ఈ సరుకులు పంపిణీ చేసారు. చౌకధరలకు ఈ ఉచిత ఆరు రకాల సరుకుల 20 శాతం వచ్చాయి. గత ఏడాది కూడా ఇవే సరుకులు పంపిణీ చేయగా డీలర్లకు మొత్తం సరుకులు ఇవ్వడంతో వాటిని తూకం వేసి పంపిణీ చేసారు. ఈ ఏడాది అన్నిటిని జిల్లా కేంద్రం నుండి ప్యాకింగ్ చేసిన సరుకులు రేషన్ డిపోలకు అందజేసారు. ఈ సరుకులను కేంద్రంలోనే తూకం వేయగా 40 నుండి 60 గ్రాములు బరువు తక్కువగా వస్తున్నది. ఈ పాస్ మిషన్లు బరువు తక్కువ గల సరుకులు అనుమతించక పోవడంతో డీలరుల బరువుకు సరిపడా వేరే వస్తువులు కాటాపై వేసి లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఉచితం పేరుతో ఇలా తక్కువ బరువు గల వస్తువులను లబ్ధిదారులకు పంపిణీ చేసి మోసం చేయడం ప్రభుత్వానికి తగదని అంటున్నారు. తక్కువ తూకం వేసి ఇచ్చే డీలర్ల పైన చర్యలు తీసుకునే ప్రభుత్వం ఇప్పుడు జిల్లా కేంద్రం నుండి తక్కువ తూకంతో వచ్చిన ఈ సరుకుల పై దృష్టి సారించి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.