రాష్ట్రీయం

దళితుల పరిశ్రమలకు 275 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రి రావెల వెల్లడి

హైదరాబాద్, డిసెంబర్ 28 : రాష్ట్రంలో దళితులను ఆర్థికంగా ఉన్నతస్థాయికి తీసుకురావాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ సంవత్సరం పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన దళితపారిశ్రామికవేత్తలకు 275 కోట్ల రూపాయలు సబ్సిడీగా ఇచ్చామన్నారు. దీని వల్ల 16 వేల పరిశ్రమలు ఏర్పాటయ్యాయన్నారు. దళిత విద్యార్థులు చదువుకునేందుకు విద్యావకాశాలు కల్పిస్తున్నామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నామని గుర్తు చేశారు.
స్వయం ఉపాధి కింద పరిశ్రమలు ఏర్పాటుచేసేందుకు నిరుద్యోగ యువతకు ప్రోత్సాహం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఢిల్లీలో దళిత పారిశ్రామికవేత్తల జాతీయ సమావేశం నిర్వహిస్తున్నామని రావెల తెలిపారు.
ఈ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక అతిథిగా పాల్గొంటున్నారని వివరించారు.గిరిజన ఆశ్రమపాఠశాలల్లో పనిచేసే తాత్కాలిక ఉపాధ్యాయులకు ప్రస్తుతం ఇస్తున్న ఐదువేల రూపాయల వేతనానికి తోడుగా మరో 1500 రూపాయలు కలిపి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ ఉద్యోగులు పదో వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు వేతనాలు చెల్లించాలని చేస్తున్న డిమాండ్ పరిశీలనలో ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన తర్వాత సముచిత నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.