రాష్ట్రీయం

అటు అభివృద్ధి మంత్రం.. ఇటు గాలింపు తంత్రం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మావో’ రెడ్‌జోన్లపై కేంద్రం నజర్?
ఏజెన్సీలో ఇక వౌలిక సదుపాయాలు
అభివృద్ధితోనే చెక్ పెట్టాలని సూచన
తెలుగు రాష్ట్రాల్లో సర్వే

హైదరాబాద్, డిసెంబర్ 6:నెల రోజులుగా పోలీసులు, మావోయిస్టుల మధ్య కొనసాగుతున్న హోరాహోరీ కాల్పుల ఘటనల నేపథ్యంలో మావోయిస్టులపై పట్టు సాధించేందుకు వ్యూహానికి కేంద్రం పదునుపెడుతోంది. వారిని తుదముట్టించేందుకు గట్టి చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ నిశ్చయించింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని మారుమూల ప్రాంతా ల్లో కనీస వౌలిక వసతులు కల్పిస్తూ, మావోయిస్టులకోసం గాలింపు చర్య లు చేపట్టాలని, అవసరానికి అనుగుణంగా హెలికాఫ్టర్లు వినియోగించాలని నిర్ణయించింది.
ఇటీవల మావోయిస్టుల ప్రాబల్యం గల ప్రాంతాలను రెండు ‘రెడ్ జోన్లు’గా ప్రకటించింది. మావోయిస్టులపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం హోంశాఖ రెండు తెలుగు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతోపాటు ఛత్తీస్‌గఢ్, బీహార్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన అధికారులతో కేంద్ర హోంశాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ నెల 4న జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవిఆర్‌కృష్ణారావు, డిజిపి జెవి రాముడు కూడా పాల్గొన్నారు. కాగా ఈ కాన్ఫరెన్స్‌లో నక్సల్స్ ప్రాంతాల్లో వౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా కేంద్రప్రభుత్వం అనుమతించిందని హోంశాఖ తెలిపింది. అభివృద్ధితోనే మావోయిజానికి చెక్ పెట్టాలని కేంద్రప్రభుత్వం సంకల్పాన్ని హోం శాఖ సమ్మతించింది.
హోంశాఖ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారులు సర్వే చేపట్టారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు అనివార్యమంటూ అందుకు సంబంధించి ప్రణాళికల రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే అభివృద్ధి ప్రణాళికలు సిద్ధమవుతున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మావోయిస్టుల ఏరివేతకు ఏజెన్సీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తూనే మరోవైపు హెలికాప్టర్లను వినియోగించేందుకు సిద్ధమవుతోంది. ఐదు రాష్ట్రాల్లోని 35 జిల్లాలను రెండు రెడ్ జోన్లుగా ప్రకటించింది. కాగా కేంద్రప్రభుత్వం మారుమూల ప్రాంతాల అభివృద్ధితోనే మావోయిజానికి చెక్ పెట్టొచ్చన్న అభిప్రాయానికి వచ్చింది. ఈ మేరకు తగిన నిధులు కూడా ఎల్‌డబ్ల్యుఇ పథకం ద్వారా కేటాయించేందుకు నిర్ణయించింది. ఏజెన్సీలో పీసా చట్టం అమలుతో ఆదివాసిలకు భూములపై హక్కు ఉంటుందని తద్వారా ఆదివాసీలు మావోయిస్టులను ఆశ్రయించకుండా, వారి సానుభూతిపరులుగా కూడా కాకుండా ఉంటారని కేంద్రం భావిస్తోంది. ఆ దిశగానే గోదావరి నదిపై ఖమ్మం-గడ్చిరోలి వంతెనను నిర్మించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్టల్రోని 15 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 20 జిల్లాలు అభివృద్ధి చెంది మావోయిస్టుల ప్రాబల్యం తగ్గే అవకాశం ఉంటుందని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. ఈ ఆపరేషన్‌కు స్పెషల్ ఇండియా రిజర్వుడ్ బెటాలియన్‌ను ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాల్లో పోలీసు బలం పెంచుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.