రాష్ట్రీయం

క్రమబద్ధీకరణపై వౌనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవో 59పై అడుగు ముందుకేయని సర్కారు
సొమ్ములు అందాక ఉలుకూ పలుకూలేని వైనం
ఏడాదిలో మొదలేకాని దరఖాస్తుల పరిశీలన
రూ.144 కోట్లు చెల్లించిన మధ్యతరగతి జనం
పట్టాల పంపిణీపై అతీగతీలేని సిఎం కెసిఆర్ హామీ
సిసిఎల్‌ఎ కమిషనర్ ఆదేశాలు బేఖాతరు

హైదరాబాద్, డిసెంబర్ 7: ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో నివాసాలు, ఇతర నిర్మాణాలు చేసుకున్న వారికి నామమాత్రపు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపులతో క్రమబద్ధీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కిందట జారీ చేసిన జీవో 59పై ఇంకా అడుగుముందుకు పడటం లేదు. ఆక్రమిత స్థలాలకు చెల్లించాల్సిన ఫీజు మొత్తాన్ని ఒకేసారి చెల్లించిన వారికి డిసెంబర్‌కల్లా క్రమబద్ధీకరణ పట్టాలు అందిస్తామని, వాయిదాల రూపంలో చెల్లించిన వారికి సంక్రాంతికి క్రమబద్ధీకరిస్తామని సిఎం కెసిఆర్ స్వయంగా ప్రకటించారు. అయినప్పటికీ జీవో 59పై రెవిన్యూ శాఖలో ఇప్పటికీ ఉలుకూ పలుకూ లేకుండాపోయింది. జీవో 59కింద వచ్చిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో ఇప్పటికీ అటకపైనే ఉండిపోయాయి. క్రమబద్దీకరణ పథకం ద్వారా ప్రభుత్వానికి డిసెంబర్ నెలాఖరుకు సుమారు రూ.1450 కోట్ల వరకూ రాబడి రానుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. అయితే రెవిన్యూ ఉన్నతాధికార్ల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి ఇప్పటివరకు వచ్చింది కేవలం రూ.143 కోట్లు మాత్రమే. గత ఏడాది డిసెంబర్ 31న ప్రభుత్వ ఆక్రమిత భూముల క్రమబద్దీకరణ జీవో 59 జారీ అయింది. జూన్ 2, 2014 నాటికి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని నివాసాలు ఏర్పర్చుకున్న వారికి మాత్రమే పథకం వర్తిస్తుందని ప్రభుత్వం నిబంధన పెట్టింది. అలాగే జూన్ 2, 2014 నాటికి ఆక్రమిత స్థలానికి రిజిస్ట్రేషన్ విలువలో 125నుంచి 250 గజాల వరకు 25శాతం, 250నుంచి 500 గజాల స్థలానికి 50శాతం, 500లకు పైగా ఆక్రమిత స్థలాలకు 100శాతం చెల్లించి క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ విలువలో 10శాతం డబ్బుకు డిడిలను జత చేసి జనవరి నెలాఖరుకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించింది. తర్వాత ఈ గడువు ఫిబ్రవరి నెలాఖరు వరకూ పొడిగించింది. గడువు ముగిసేసరికి ప్రభుత్వానికి డిడిల రూపంలో రూ.133 కోట్ల ఆదాయం వచ్చినట్టు శాసనసభకు సమర్పించిన బడ్జెట్ పద్దుల్లో ఆర్థికశాఖ వెల్లడించింది. ప్రభుత్వానికి ఒకేసారి డబ్బు చెల్లించిన వారికి మూడు నెలలలో క్రమబద్ధీకరణ పట్టాలిస్తామని, అలాగే ఒకేసారి చెల్లించలేని మధ్యతరగతి ప్రజానికి డిసెంబర్ నెలాఖరు వరకు ఐదు విడతలలో చెల్లించడానికి అవకాశం కల్పించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రెండో విడత చెల్లింపునకు ఏప్రిల్, మూడో విడత చెల్లింపునకు సెప్టెంబర్, నాలుగో విడత చెల్లింపునకు నవంబర్, ఐదో విడత చెల్లింపునకు డిసెంబర్ వరకు గడువుపెట్టింది. ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుతో క్రమబద్ధీకరణకు ముందుకొచ్చి ఒకేసారి డబ్బు చెల్లించిన వారికి ఇప్పటివరకు వాటిని క్రమబద్దీకరించకపోగా, విడతవారీగా చెల్లించిన వారినుంచి కేవలం రెండు విడతలు మాత్రమే డబ్బులు వసూలు చేసింది. ఆ తర్వాత చెల్లించాల్సిన మూడు, నాలుగు, ఐదవ విడతల చెల్లింపుల కోసం రెవిన్యూశాఖ నుంచి ఇప్పటిదాక ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తల తాకట్టుపెట్టి ఒకేసారి డబ్బు చెల్లించిన వారికిగానీ, ఐదు విడతల్లో డబ్బు చెల్లించడానికి ముందుకొచ్చి, రెండు విడతలు చెల్లించిన వారికిగానీ క్షేత్రస్థాయిలో రెవిన్యూశాఖ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో జీవో 59 ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనన్న చందంగా మారింది. మధ్యతరగతి ప్రజల కోసం ప్రభుత్వం సదుద్దేశంతో తీసుకొచ్చిన పథకం పట్ల రెవిన్యూశాఖ అధికారులు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం వల్ల అటు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం సమకూరకపోగా, ఇప్పటికే అప్పుసప్పు చేసి డబ్బు చెల్లించిన మధ్యతరగతి ప్రజలకు క్రమబద్ధీకరణ జరగకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీ చెల్లించాల్సి రావడంతో ఆందోళనకు గురవుతున్నారు.