తెలంగాణ

సర్వేలన్నీ టిడిపివైపే !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్ ఎన్నికలపై రేవంత్ జోస్యం

సికింద్రాబాద్, జనవరి 2: గ్రేటర్ ఎన్నికలపై అన్ని సర్వేలు టిడిపికి అనుకూలమనే చెబుతున్నాయని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం తెలుగుదేశం పార్టీ నగర కార్యాలయంలో గ్రేటర్‌లోని 150 డివిజన్‌ల అధ్యక్షులు ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, త్రిసభ్యకమిటీ సభ్యులు పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నగర అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అధ్యక్షత వహించారు.
రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కేసిఆర్, కేటిఆర్‌లకు నార్కో పరీక్షలు నిర్వహిస్తే గ్రేటర్‌లో టిడిపి విజయానికి దగ్గరగా ఉందన్న వాస్తవాన్ని వెల్లడిస్తారని అన్నారు. సంక్రాంతి తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని కేటిఆర్ ఎలా ప్రకటిస్తారని, అది చెప్పాల్సింది ఎన్నికల కమిషన్ అని అన్నారు. కేటిఆర్ హామీలు కేసిఆర్‌ను మించిపోయాయని, గ్రేటర్ మేయర్ ప్రత్యక్ష ఎన్నికకు కేటిఆర్ ఒప్పుకోవడం కాదు, కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. తాము అడుగుతున్న ప్రశ్నలకు కేటిఆర్‌కు దమ్ముంటే సూటిగా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. హైటెక్‌సిటీ నిర్మించి తెదేపా డ్రైనేజీలు మర్చిపోతే 18 నెలలుగా తెరాస ప్రభుత్వం ఏం చేస్తోందన్నారు. తొలగించిన ఓట్లను ఎప్పటిలోగా పునరుద్ధరిస్తారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ట్యాంక్‌బండ్‌పై ధ్వంసం చేసిన విగ్రహాలను ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కలిసికట్టుగా ఐకమత్యంతో పనిచేయాలని విజయం తమదేనని అన్నారు. తెదేపా శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ తెరాస తెదేపా నేతలను చేర్చుకోవడానికి ఇప్పటివరకు వెయ్యికోట్లు ఖర్చుచేసినట్లు తెలుస్తోందన్నారు. ఎన్టీఆర్ తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా నేడు తెలంగాణలో అభివృద్ధి సాధ్యమవుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కష్టపడితే తప్పకుండా విజయం దక్కుతుందని, కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్‌గౌడ్, నగర అధ్యక్షుడు మాగంటి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గ్రేటర్‌లో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెరాస ఎన్ని జిమ్మిక్కులు చేసి నా ప్రజలు తెలుగుదేశం పార్టీ పక్షాన ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎంపి మల్లారెడ్డి, పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కెపి వివేకానందగౌడ్, అరికెల నర్సారెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.