తెలంగాణ

విలీనం ఓ రాజకీయ కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పీకర్ తీరును తప్పుపట్టిన టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 11: టిఆర్‌ఎస్‌లో టిడిపి ఎమ్మెల్యేల విలీన ప్రకటన వెనక రాజకీయ కుట్ర ఉందని, ఎమ్మెల్యేలను ఆదరబాదరగా విలీనం చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ధ మాట్లాడుతూ గతంలో టిడిపి ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్‌లు టిడిపిలో చేరినపుడు వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఈ వ్యవహారంలో స్పీకర్ సక్రమంగా వ్యవహారించటం లేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు లేఖను పరిగణలోకి తీసుకుని స్పీకర్ టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో విలీనమయ్యారని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. దీనిపై ఎరబ్రెల్లి దయాకర్‌రావు సమాధానం చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఒకప్పటి నుంచి తీగల, తలసానిల విలీనమే పెండింగ్‌లో ఉండగా, ఇపుడు తాజాగా చేరిన ఎమ్మెల్యేలను కలపుతూ టిడిపి ఎమ్మెల్యేలంత టిఆర్‌ఎస్‌లో విలీనమయ్యారంటూ స్పీకర్ ఆదరబాదరగా ప్రకటించే అవసరం ఏమిటీ? అని ఆయన ప్రశ్నించారు.
టిడిపా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో స్పీకర్ ఎలా విలీనం చేసుకుంటారని, ఇది న్యాయపరంగా ఎక్కువ రోజులు నిలవదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రకమైన పార్టీ పిరాయింపులను ప్రోత్సహించటాన్ని ప్రజాస్వామ్యవాదలంతా వ్యతిరేకించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. అయితే అప్పట్లో టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలను ఆ పార్టీ సస్పెన్షన్ చేసినా, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు.
స్పీకర్ నిర్ణయం అప్రజాస్వామికం
వరంగల్: తెలుగుదేశం పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌లో విలీనం చేసుకోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రేవూరి మాట్లాడుతూ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి టిఆర్‌ఎస్ కార్యకర్త వలే వ్యవహరిస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఆరోపించారు. అసెంబ్లీ స్పీకర్‌గా అన్ని పార్టీలకు సమానంగా వ్యవహరించాల్సిన స్పీకరే ఏకపక్షంగా వ్యవహరించడంపై ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసి ఆర్ ప్రతిపక్షం లేకుండా చేయాలని కుట్రపన్నాడని ఆయన విమర్శించారు. ప్రతిపక్షం లేనట్లయితే ప్రజాసమస్యలే పరిష్కారం కావని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి సంఘటనలు దురదృష్టకరమన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కెసి ఆర్ మహారాష్ట్ర ప్రభుత్వంతో ప్రాజెక్టులపై బ్యారేజీల నిర్మాణం ఒప్పందం వల్ల తెలంగాణకు వచ్చే లాభం ఏమీ లేదని ఆయన అన్నారు. దీని వల్ల ముఖ్యమంత్రి కెసిఆర్, ఆయన కాంట్రాక్టర్లకే లబ్ధి చేకూరుతుంది తప్ప తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.