కృష్ణ

జెడ్‌పికి ఆదాయ మార్గాలు అనే్వషించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 9: జిల్లా పరిషత్ ఆస్తులను పరిరక్షించటంతో పాటు ఆదాయ మార్గాలు అనే్వషించాలని జడ్‌పి చైర్‌పర్సన్ గద్దె అనూరాధ ఎంపిడివోలు, పంచాయతీ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జడ్‌పి సమావేశ మందిరంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, జడ్‌పి ఆస్తుల పరిరక్షణ - ఆదాయ మార్గాల అనే్వషణ, గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ అనూరాధ మాట్లాడుతూ 13, 14వ ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు విడుదల చేయటంతో జిల్లా పరిషత్‌కు ఆదాయ వనరులు తగ్గాయన్నారు. దీన్ని భర్తీ చేసుకునేందుకు వేలాది కోట్లు విలువ చేసే జడ్‌పి ఆస్తులను గుర్తించి ఆదాయ వనరులుగా మల్చుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు అనువుగా ఉన్న జడ్‌పి స్థలాలను గుర్తించి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. నిర్మాణాలకు సంబంధించిన అంచనాలు కూడా తయారు చేసి వెంటనే జడ్‌పికి పంపాలని పంచాయతీ రాజ్ అధికారులను ఆదేశించారు. షాపింగ్ కాంప్లెక్స్‌లు, కళ్యాణ మండపాలు ఇతరత్రా నిర్మాణాలు చేపట్టి లీజుకు ఇవ్వడం ద్వారా జడ్‌పికి గణనీయమైన ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. ఉదాహరణకు విజయవాడ జడ్‌పి క్యాంప్ కార్యాలయం వద్ద మూడు ఎకరాల ఖాళీ స్థలం ఉందన్నారు. కార్యాలయాల నిమిత్తం భవంతిని నిర్మించేందుకు ఎన్‌బిసిసి సంస్థ ముందుకు వచ్చిందన్నారు. రూ.60లకు లీజుకు ఇచ్చినా యేడాదికి 40కోట్ల మేర ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. షాపింగ్ కాంప్లెక్స్‌లు, కళ్యాణ మండపాలు ఇతరత్రా కట్టడాలకు డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో నిర్మాణాలు చేపడితే పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండన్నారు. నేరుగా జడ్‌పి నిధులతోనే గ్రామాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయవచ్చన్నారు. ఆ దిశగా ఎంపిడివోలు, పిఆర్ అధికారులు పని చేసి ఖచ్చితమైన నివేదికలు అందించాలని ఆదేశించారు. అలాగే జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి ఏప్రిల్ మాసాంతానికి పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.70కోట్ల మేర అభివృద్ధి పనులకు మంజూరు చేశామన్నారు. రానున్న మూడు నెలల్లో ఎటువంటి పనులను మంజూరు చేసేది లేదని తేల్చి చెప్పారు. జరుగుతున్న పనులను ఏప్రిల్ నెలాఖరు నాటికి పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలన్నారు. పనులు పూర్తయిన వెంటనే 49 మండలాల్లో రోజుకొక మండలం చొప్పున ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. శిలాఫలకాలను విధిగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకంలో ప్రజా ప్రతినిధుల పేర్లు ఉండేలా చూడాలన్నారు. గ్రామీణ మహిళల ఆర్థిక స్వాలంభనకు చేతి వృత్తుల్లో శిక్షణ ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండలం నుండి 100 మంది చొప్పున జిల్లాలో 5వేల మంది చేతి వృత్తుల్లో శిక్షణ ఇప్పించాలని, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి జడ్‌పి నిధుల ద్వారా ఆయా వృత్తులకు సంబంధించిన పరికరాలు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో జడ్‌పి సిఇఓ వి నాగార్జున సాగర్, డిప్యూటీ సిఇఓ నాగమల్లేశ్వరరావు, జడ్‌పిటిసిలు లంకే నారాయణ ప్రసాద్, పైడిపాముల కృష్ణకుమారి, కె వెంకటేశ్వరరావు, పిఆర్ డిఇలు, ఇఇలు, ఎంపిడివోలు పాల్గొన్నారు.