క్రైమ్/లీగల్

డ్రైవర్‌తో కుమ్మక్కు. .భర్త హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, సెప్టెంబర్ 3: డబ్బులకు కక్కుర్తి పడి పోస్టల్ ఉద్యోగిని హత్య చేసిన సంఘటనలో వ్యక్తిని వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏసీపీ గాంధీ నారాయణ కధనం ప్రకారం కమ్మగూడ భవానీనగర్ కాలనీలో నివాసం ఉంటూ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న కేశ్య నాయక్ నల్గొండ జిల్లా త్రిపూరం మండలానికి చెందిన కేషవత్ పద్మతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్ని రోజుల తర్వాత వీరికి గొడవలు రావడంతో విడిగా ఉంటున్నారు. తనను వేధిస్తున్నాడని వరకట్నం కేసు పెట్టడంతో కోర్టులో కేసు నడుస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఒంటరిగా ఉంటున్న కేశ్య నాయక్ మరో మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. కోర్టులో కేసు ఉన్నప్పటికీ మరో వావాహం చేసుకొని తనకు తీరని అన్యాయం చేస్తున్న భర్త కేశ్య నాయక్‌ను చంపాలని పద్మ పథకం వేసింది. కేశ్య నాయక్ వద్ద అప్పుడప్పుడు డ్రైవర్‌గా పని చేస్తూ నందివనపర్తి గ్రామం యాచారం మండలానికి చెందిన సబావత్ వినోద్(28)ను పద్మ కలిసింది. భర్త కేశ్య నాయక్‌ను హత్య చేస్తే రూ.పది లక్షలు ఇస్తానని చెప్పి ముందుగా 15వేలు అడ్వాన్స్‌గా ఇచ్చింది. హత్య చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న వినోద్ ఈనెల 1న డ్యూటీ నుంచి వస్తున్న కేశ్య నాయక్‌ను కారులో ఎక్కించుకుని గుర్రంగూడలోని ఒక బార్ షాపునకు తీసుకెళ్లాడు. పీకల దాక మద్యం సేవించిన తర్వాత కారులో ఎక్కించుకుని ఇంజాపూర్ శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. కారు ముందటి సీట్లో కూర్చొని నిద్రిస్తున్న కేశ్య నాయక్‌ను వెనక సీట్లో ఉండి వినోద్ మెడకు వైర్‌తో ఉరివేసి హత్య చేశాడు. అనంతరం సాగర్ హైవే రహదారిపై కారును చెట్టుకు ఢీకొట్టి రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు చిత్రీకరించారు. వినోద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా డబ్బుల కోసం హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. మృతిని భార్య పద్మతోపాటు వినోద్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వివరించారు. సమావేశంలో ఇన్‌స్పెక్టర్ నరేందర్, ఎస్‌ఐ సుధాకర్ పాల్గొన్నారు.