క్రైమ్/లీగల్

నల్లపోచమ్మ ఆలయంలో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, డిసెంబర్ 23: ఆల్విన్ కాలనీ నల్లపోచమ్మ దేవాలయంలో చోరీ జరిగిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఆల్విన్ కాలనీ ఫేజ్- 2లోని శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో శనివారం అర్థరాత్రి సుమారు ఒంటిగంట సమయంలో దుండగులు ఆలయంలోకి చొరబడి హుండీ తాళాలు రెండింటిని ఎక్సెల్ బ్లేడ్‌తో కట్‌చేశారు. హుండీలోని సుమారు రూ.1లక్ష ఎత్తుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. గోడ దూకి ముగ్గురు దొంగలు ఆలయంలో చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరా రికార్డుల్లో నమోదైనట్లు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.