క్రైమ్/లీగల్

మహిళ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఆగస్టు 1: కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా చిన్నరావుపేట మండలం లంకగిరికి చెందిన నాగరాజు(32)కి జనగామ జిల్లా, పెద్దకొర్రుపోలుకు చెందిన రజిత (25)తో ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ పాప, ఓ బాబు ఉన్నారు. బతుకుదెరువు నిమిత్తం మూడు సంవత్సరాల క్రితం జగద్గిరిగుట్ట, దేవమ్మబస్తీలో వచ్చి నివసిస్తున్నారు. నాగరాజు ప్రైవేట్ పరిశ్రమలో మెడికల్ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తుంటాడు. బుధవారం రాత్రి నాగరాజు, రజిత మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన రజిత.. భర్త, పిల్లలు నిద్రలో ఉండగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.