తెలంగాణ

ప్రోటోకాల్ ఉల్లంఘనకు మెమో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జనవరి 11: సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ముక్కోటి ఉత్సవాల సందర్భంగా ఓ ఉన్నతాధికారి విషయంలో పాటించాల్సిన ప్రోటోకాల్‌ను విస్మరించారంటూ ఐదుగురు ఉద్యోగులకు దేవస్థానం ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు మెమోలు జారీ చేశారు. తెప్పోత్సవం, ముక్కోటి ఏకాదశి సమయంలో హైకోర్టు న్యాయమూర్తి ఆలయ దర్శనం కోసం వచ్చారు. ఆయనకు నిబంధనల ప్రకారం ప్రోటోకాల్ పాటించడంలో అధికారులు నిర్లక్ష్యం చేశారు. తీర్ధం, శఠారి కూడా సక్రమంగా ఇవ్వలేదు. అంతేకాకుండా ముక్కోటి రోజున ఉత్తరద్వారం వద్ద సిఎం కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా సెక్టార్‌ను ఏర్పాటు చేశారు. ఆ సెక్టార్‌లో ఉన్న న్యాయమూర్తిని మధ్యలో లేపి పక్క సెక్టార్‌కు మార్చారు. దీనిపై కూడా వివాదం నెలకొంది. ఈ విషయంలో ఆలయ ఎఇఒ శ్రావణ్‌కుమార్, డిఇ రవీంద్రనాథ్, సూపరిండెంటెంట్ భవానీ రామకృష్ణ, ఉద్యోగి కిషోర్, ఆలయ ఉపప్రధానార్చకుడు గోపాలకృష్ణమాచార్యుల వివరణ కోరుతూ ఇఒ తాళ్లూరి రమేశ్‌బాబు వారికి మెమోలు జారీ చేశారు.
రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
దుమ్ముగూడెం, జనవరి 11: సంక్రాంతి పర్వదినాన్ని తాను పుట్టిన ఊరిలో జరుపుకోవడానికి తెల్లవారక ముందే బయలుదేరిన దంపతులు తిరిగిరాని లోకాలకు వెళ్లిన సంఘటన మండల పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఆర్.కొత్తగూడెం గ్రామానికి చెందిన సాగి రంగారాజు(53), భార్య సుగుణ(47) స్వగ్రామమైన తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని మురమళ్ల గ్రామానికి ద్విచక్రవాహనంపై బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరారు. ఈ సమయంలో దుమ్ముగూడెం మండలం రేగుబల్లి గ్రామం వద్ద ట్రాక్టర్ భద్రాచలం నుంచి చర్లవైపు వెళ్తూ వారిని ఢీకొట్టింది. ఈ సంఘటనలో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. వారికి కుమార్తె, రేష్మ కాకినాడ సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.