ఆంధ్రప్రదేశ్‌

రాజ్యసభ అభ్యర్థులపై చంద్రబాబు కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎపి నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఉదయం ఇక్కడ పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. నాలుగో సీటుకు కూడా పోటీ చేసే విషయమై ఆయన పలువురి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఎపి టిడిపి అధ్యక్షడు కళావెంకట్రావు, ఆర్థికమంత్రి యనమల, కేంద్రమంత్రులు అశోక్‌గజపతి రాజు, సుజనాచౌదరిలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదే సమయంలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ ఈరోజు చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ఒక రాజ్యసభ స్థానాన్ని బిజెపికి కేటాయించాలని వారు కోరుతున్నారు. ఈరోజు సాయంత్రానికి అభ్యర్థుల పేర్లపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇటీవల వైకాపా నుంచి టిడిపిలో చేరిన 16 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఈరోజు విడిగా సమావేశమై వారి అభిప్రాయాలను కూడా తెలుసుకుంటారు.