తెలంగాణ

అర్టీసీ కార్మికులు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:విధుల్లోకి చేరాలని వచ్చిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో తెలంగాణలోని పలు డిపోల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. నర్సంపేట డిపోలో 16మంది కార్మికులను అరెస్టు చేశారు. బాన్సువాడ డివిజన్ కేంద్రంలో డిపోల్లోకి వెళుతున్న కార్మికులను అడ్డుకున్నారు. హైదరాబాద్ నగరంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆర్టీసీ యాజమాన్యం మాత్రం తాత్కాలిక సిబ్బందితోనే బస్సులను నడిపిస్తోంది. పరిస్థితిని అదుపుతప్పటంతో నల్గొండ డిపో వద్ద 144 సెక్షన్ విధించారు. కొందరు మహిళా కార్మికులను వెనక్కిపంపారు. హన్మకొండలో కార్మికులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. కూకట్‌పల్లి డిపో వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఖమ్మంలో వివిధ డిపోల వద్ద 25 మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ తదితర ప్రాంతాల్లో కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల, నిర్మల్ డిపోల వద్ద విధుల్లోకి చేరతామని వచ్చిన కార్మికులను అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరంలోని అన్ని డిపోల్లో కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. భర్కత్‌పురాలో 40 మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. కాచిగూడలో 60 మంది కార్మికులను అరెస్టు చేశారు.