ఆంధ్రప్రదేశ్‌

వైకాపా నుంచి ఎవరొచ్చినా ఆహ్వానిస్తాం: శిద్దా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మార్చి 11:రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లో ఉన్న ఆర్‌టిసి బస్టాండ్లను ఎయిర్‌పోర్టు తరహాలో ఆధునీకరిస్తామని రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. శుక్రవారం రాత్రి తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లోని ఆర్‌టిసి బస్టాండ్లను ఆధునీకరించటంతోపాటు తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, పచ్చదనాన్ని పెంపొందిస్తామన్నారు. రెండవదశలో మండల కేంద్రాల్లోని ఆర్‌టిసి బస్టాండ్లను పూర్తిస్ధాయిలో అభివృద్ధిలోకి తీసుకువస్తామన్నారు. ఇప్పటికే తిరుపతి, విజయవాడ తదితర ఆర్‌టిసి బస్టాండ్లను ఆధునీకరించేందుకు రంగం సిద్ధమైందన్నారు. ఇప్పటివరకు నూతనంగా 18 వందల బస్సులను కొనుగోలు చేశామన్నారు. త్వరలో మరో వెయ్యి బస్సులను కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న రహదారులు ఏవిధంగా ఉన్నాయి, ఎక్కడ రహదారి అవసరమో తెలుసుకునేందుకు ఆస్ట్రేలియానుండి ఆక్వామీషన్‌ను తెప్పించామన్నారు. ఈ మిషన్ ద్వారా రాష్ట్రంలోని రోడ్లు అన్ని సర్వేచేసి జూన్‌నాటికి పనులను ప్రారంభిస్తామన్నారు.