రాష్ట్రీయం

మీరే కనికరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిండిగింజలు కూడా లేవు : కేంద్రానికి రైతుల వేడుకోలు

మహబూబ్‌నగర్, డిసెంబర్ 7: అంతా దుర్భిక్షం..తినేందుకు తిండి గింజలు లేవు. మీరే కనికరించాలంటూ కేంద్ర కరవు బృందానికి పాలమూరు రైతులు తమ కష్టాల కడలిని వినిపించుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర కరవు బృందం రాష్ట్రంలో పర్యటనకు వచ్చారు. అందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో సభ్యులు ఉత్పల్‌కుమార్‌సింగ్, పోల్లాస్వామి సభ్యులతో కూడిన బృందం సోమవారం పలు మండలాల్లో పర్యటించారు. జడ్చర్ల, మిడ్జిల్, కల్వకుర్తి, ఆమనగల్లు, వెల్దండ మండలాల్లో పర్యటించి ఎండిపోయిన పంటలతో పాటు భూగర్భజలాలపై కూడా ఆరా తీశారు. మిడ్జిల్ మండలంలోని వాడ్యాల, కొత్తపల్లి గ్రామాల్లో ఎండిన పంటలను చూసిన కేంద్ర కరవు బృందం చలించిపోయింది. జడ్చర్ల మండలంలో ఎండిపోయిన పంటలను పరిశీలించి కొంతమంది రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమకు జరిగిన పంట నష్టాలను అంచనాతో సహా తేల్చిచెప్పారు. మీరే ఆదుకోవాలని, ఇప్పటికే తమ చుట్టుపక్కల ఒకరిద్దరు రైతులు అప్పులబారిన పడి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని కరవు బృందం సభ్యుల దృష్టికి రైతులు తీసుకువచ్చారు. తమ ఇళ్లల్లో ఈ ఏడాది తిండిగింజలు కూడా లేకుండా పోయాయని, భార్య, పిల్లలను పోషించుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు తమ మొరను విన్నవించుకున్నారు. అదేవిధంగా జడ్చర్లలో ఏర్పాటు చేసిన కరవు పరిస్థితులు సంబంధించిన ఫొటో ఎక్జిబిషన్‌ను బృందం సభ్యులు పరిశీలించారు. బృందం సభ్యులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ సీనియర్ నాయకుడు రంగారావు, టిడిపి తరపున మాజీ ఎమ్మెల్యేలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, బిజెపి నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి జిల్లాలో నెలకొన్న కరవు పరిస్థితులపై వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర కరవు బృందం సభ్యులు కూడా పలు గ్రామాల్లో రైతులకు భరోసా కల్పిస్తూ పంటలను పరిశీలిస్తున్నామని, తీవ్రమైన నష్టం వాటిల్లిందని కేంద్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను అందిస్తామని తెలిపారు. అయితే జిల్లాలో భూగర్భజలాల పరిస్థితులపై కూడా ఆరా తీశారు. ఏదేమైనప్పటికీ కేంద్ర కరవు బృందం పర్యటన జిల్లాలో పర్యటించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి వారికి దాదాపు రూ.600 కోట్లకుపైగా నష్టానికి సంబంధించిన అంచనాల నివేదికలను అందించారు. దాదాపు అన్ని పంటలు 3.7 5లక్షల హెక్టార్లలో ఎండిపోయినట్లు కూడా నివేదికలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కమిషనర్ జిడి ప్రియదర్శిని, జిల్లా వ్యవసాయశాఖ జెడి ఉష, జాయింట్ కలెక్టర్ రాంకిషన్, ఆర్డీఓ హన్మంతురెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.