అక్షర

సైన్స్ రచనలో మంచి ప్రయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైన్సు విజయాలు
రచన: జె.ఎస్.్భస్కర్
పేజీలు: 100.. ధర: రు.75/-
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, చుట్టగుంట, విజయవాడ
ఫోన్: 0866-2430302

సైన్సు ఎవరితోను పోటీపడదు. సైన్సుకు విలువలు, విజయాలు లేవు. సైన్సు అవగాహనను వాడుకుని మనిషి విజయం సాధిస్తాడు. తనకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటాడు. ఈ రచయిత ఉత్సాహంతో ఆ రకం సౌకర్యాల సంగతులను పోగుచేసి విశాలాంధ్ర దినపత్రికలో వరసగా రాశాడు. ఆ ముక్కలు ప్రస్తుతం ఒక పుస్తకం రూపంలో ముందుకు వచ్చాయి. నాకు తెలిసినంతలో, తెలుసుకున్న పరిధిలో గురువులెవరూ లేకుండానే అంటూనే రచయత మంచి ప్రయత్నం చేసాడు. ఈ ప్రపంచంలో ఎవరూ మొదట్లోనే నిపుణులు కాలేదు. ఈ రచన చూసిన తర్వాత తెలుగులో సైన్సు అంశాలు రచన గురించి, శిక్షణలు, వర్క్‌షాప్‌లు జరిగితే బాగుండును అన్న ఆలోచన మరోసారి బలంగా ముందుకు వచ్చింది. సైన్సు రచనలో ప్రతివాక్యంలోను సత్యాలు, వివరాలు, విశేషాలు ఉండాలి. ఈ రచనలలో అభిప్రాయాలకు చోటులేదు. పడమటి దేశాల ఆడవారు మక్కువతో గాజులు ధరిస్తారని ఒకచోట రాశారు. నిజంగానా? మన దేశంలో అమ్మాయిలే మానేసినట్టున్నారే? సైన్సు రచనలో ప్రతి వాక్యం పరీక్షకు నిలబడేదిగా ఉండాలి. పేపర్ గురించిన మాటలు చాలా బోలుగా ఉన్నాయి. చిన్న ముక్కలు రాస్తున్నప్పుడు చిక్కదనం అవసరం. బీస్ వాక్స్ అంటే తేనెపట్టులో మైనం. చాక్లెట్ అనకూడదు. ఈ రచయిత మరింత కృషి చేస్తాడని ఆశ! *