రాష్ట్రీయం

సామాన్యులకు అందుబాటులో పురాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 21 : పురాణాలను సరళమైన భాషలో అనువదించి, త్వరితగతిన ముద్రించి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు టిటిడి కార్యనిర్వహణాధికారి డా. డి సాంబశివరావు ఉద్ఘాటించారు. టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా ఉన్న ప్రముఖ పండితులతో ‘పండిత పరిషత్’ సమావేశం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఇప్పటి వరకు పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వర్యంలో పరిష్కరించిన పురాణాలను వెంటనే ముద్రించాలని అధికారులకు సూచించారు. ముద్రణ పూర్తయిన గ్రంథాలను టిటిడి వెబ్ సైట్‌లో ఉంచినట్లు తెలిపారు. అనువాదం పూర్తికాని పురాణాలను ఇతర పండితులకు పంపి, నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని ఆయన కోరారు. టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య మాట్లాడుతూ పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వర్యంలో 48 పురాణాలకు సంబంధించి శ్లోకాలను రాష్టవ్య్రాప్తంగా 55 మంది ప్రముఖ పండితులు పరిష్కరిస్తున్నట్లు వివరించారు.