కృష్ణ

పిబి సిద్ధార్థలో సంక్రాంతి సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జనవరి 10: పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాలలో ముందుగానే సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంది. కళాశాల ఆవరణలో సంక్రాంతి శోభ ప్రతిబింబించేలా కళాశాల విద్యార్థినీ విద్యార్థులు మంగళవారం కళాశాల ప్రాంగణంలో సాంప్రదాయ పోటీలు నిర్వహించారు. కొండపల్లి బొమ్మలు, గొల్లభామ, రాధాకృష్ణులు, వృత్తి కళాకారులు, లాఫింగ్ బుద్ధ వంటి బొమ్మలను ఆకర్షణీయంగా అమర్చి బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంస్కృతి ఉట్టిపడేలా రంగవల్లులు, గొబ్బెమ్మలు, చెరుకు గడలు, పొంగలి కుండలతో ఎంతో అందంగా కళాశాల ఆవరణను అలంకరించారు. అనంతరం భోగి మంట చుట్టూ గంగిరెద్దులాట ప్రదర్శన నిర్వహించి విద్యార్థినీ విద్యార్థులు డప్పు వాయిద్యానికి అనుగుణంగా విద్యార్థినీ విద్యార్థులు నృత్యం చేశారు. బొమ్మల కొలువు నిర్వహించిన విద్యార్థినులు తెలుగు సాంప్రదాయ వంటకాలైన అరిసెలు, సున్నుండలు, చక్కలు తదితర వాటిని విద్యార్థులకు రుచి చూపించారు. హరిదాసు కీర్తనలు పాడుతూ చూపరులను ఆకట్టుకున్నారు. గాలిపటం పోటీలు, విద్యార్థులకు భారతీయ వంటకాల పోటీలు, సంప్రదాయ వస్తధ్రారణ పోటీలు, నిధి అనే్వషణ (ట్రెజర్ హంట్) నిర్వహించారు. విజేతలకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రమేష్, డైరక్టర్ వేమూరి బాబూరావు, డీన్ జె.రాజేష్ విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సంబరాలను మహిళా సాధికారతా విభాగం కన్వీనర్ కంప్యూటర్ సైన్స్ విభాగం అధ్యాపకులు ఎం.్భద్రజ, ఝాన్సీలక్ష్మి, ఎం.శోభన, కవిత తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
వేస్ట్ టు వెల్త్ వైపు నవ్యాంధ్ర అడుగులు
విజయవాడ (కార్పొరేషన్), జనవరి 10: వేస్ట్ టు వెల్త్ వైపు నవ్యాంధ్ర అడుగులేస్తోందని, అవగాహనతోనే సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్లు సఫలీకృతమవుతాయని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కె కన్నబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, విజయవాడ ఆధ్వర్యంలో న్యూ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్- 2016 అనే అంశంపై మంగళవారం నగరంలోని ఒక హోటల్లో నిర్వహించిన రెండు రోజుల వర్క్‌షాప్‌ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ ఏరియాలలో శానిటేషన్ మెరుగుకు విస్తృత చర్యలు తీసుకోవడంతోపాటు వేస్ట్ మేనేజ్‌మెంట్ లను సక్రమంగా నిర్వహించే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. ఏరియాలలో ఇప్పటివరకూ నీటి సరఫరాపైనే దృష్టి సారించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇకనుంచి వేస్ట్ మేనేజ్‌మెంట్‌ను మెరుగైన పద్దతుల్లో వేస్ట్ టు వెల్త్ అనే నినాదంతో పనిచేయబోతున్నట్టు తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా నిధులను సమీకరించి పలు చర్యలను చేపడుతున్నామన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌ను వినియోగించి విద్యుత్, వ్యవసాయ ఎరువుల ఉత్పత్తితో తగు ఆదాయం పొందే విధంగా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. విజయవాడ, గుంటూరు మున్సిపల్ ఏరియాలతోనే కాకుండా రాజధాని అమరావతి ప్రాంతాలకు చెందిన సాలిడ్ వేస్ట్ గార్బేజ్ తరలించేందుకు అధునాతన పద్దతుల్లో డంపింగ్ యార్డుతోపాటు పవర్ ఎనర్జీ ప్లాంట్ గుంటూరు జిల్లా నాయుడుపేట లో ఏర్పాటవుతోందని, ఆయా పనులు జరుగుతున్నాయన్నారు. శానిటేషన్ చర్యల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 279 జీవో మరికొద్ది రోజుల్లో పూర్తి అమలులోకి రాబోతోందని ప్రకటించారు. పూర్తి డిజిటిలైజేషన్ తో పనిచేసే శానిటేషన్ పనులతోపాటు డంపర్ బిన్లు, డంపింగ్ యార్డుల వద్ద సిసి కెమేరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ నుంచి నిరంతర పర్యవేక్షణ జరుగనున్న నేపథ్యంలో విజయవాడ, వైజాగ్, తిరుపతి తదితర ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లు స్వచ్ఛాంధ్రలో భాగస్వాములవుతాయన్నారు.
అలాగే లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా సెప్టిక్ ట్యాంక్‌ల నుంచి సేకరించే వేస్ట్‌తోపాటు గృహాల నుంచి విడుదలైయ్యే వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్‌లలో కూడా విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నట్టు వివరించారు. శానిటేషన్, వేస్ట్ మేనేజ్‌మెంట్లలో పొల్యూషన్ కంట్రోల్ సంస్థ కూడా భాగస్వామ్యమవుతున్న వైనం అభినందనీయమని, లక్ష జనాభా ఉన్న నగరాలు, అమృత్ నగరాలలో పిసిబి నిర్మాణాత్మకంగా భాగస్వామ్యమవుతోందని వివరించారు. ప్రభుత్వపరంగా వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై ప్రజలకు తగు అవగాహన లేకపోతే ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదన్న విషయాన్ని గుర్తించి మేనేజ్‌మెంట్ చర్యలపై చైతన్యపర్చాలని హితవుపలుకుతూ ఇటువంటి వర్క్‌షాప్‌ల్లో ఈ విషయాలను ప్రజలకు చేరువచేయాలన్నారు. సభానంతరం సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ -2016 అంశంపై జెసిఇఇ, బిఓ హైదరాబాద్ ఎం శివారెడ్డి, కన్‌స్ట్రక్షన్ అండ్ డిమోలిషన్ వేస్ట్ రూల్స్ -2016, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ -2016 అంశంపై సిపిసిబి జోనల్ ఆఫీస్, బెంగుళూరు ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ టి మహిమ, ఇ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్- 2016 అంశంపై డాక్టర్ మధుసూధనరావు, పిసిబి జిల్లా రీజనల్ ఆఫీసర్ ఇ సత్యనారాయణ పిసిబి ఇఇ బాల సుబ్రమణ్యం తదితరులు ఆయా అంశాలపై పవర్ ప్రజెంటేషన్ చేసారు.