కరీంనగర్

‘సెస్’ ఎన్నికల వేడి ప్రారంభమైనా.. అభ్యర్థిత్వాలపై పార్టీల్లో కానరాని స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, జనవరి 22: సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ పోటీ చేసే అభ్యర్థులపై ఇంకా స్పష్టత రావడం లేదు. సిరిసిల్ల డివిజన్‌లోని తొమ్మిది మండలాలకు చెందిన నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉండి ప్రతిష్టాత్మకంగా జరిగే సెస్ ఎన్నికల్లో ఈసారి రాజకీయ పార్టీల నుండి అంతగా వేడి పుంజుకోలేదు. అధికార టిఆర్‌ఎస్ పార్టీలో మాత్రం పోటీ చేసే ఆశావహుల సంఖ్య ఎక్కువే ఉన్నా, అభ్యర్థిత్వాల ఖరారు అంశం రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు ఆధారపడి ఉండడంతో ఇప్పడే వారి పోటీ అంశంపై ప్రకటించుకోవడం లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సెస్ టిఆర్‌ఎస్ దక్కించుకోగా, ఆ పాలకవర్గం పదవీకాలం ముగిసిపోవడంతో కొంత కాలం జాయింట్ కలెక్టర్ పర్సన్ ఇన్‌చార్జితో పాలన సాగింది. మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వంలో నాగుల సత్యనారాయణగౌడ్, కేతిరి జగన్మోహన్‌రెడ్డిలను నామినేట్ చేయగా, స్వల్పకాలంలోనే కోర్టు జోక్యంతో వీరి పాలనకు బ్రేక్ పడింది. అయితే టి ఆర్ ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసిన డి.లక్ష్మారెడ్డి నేతృత్వంలోని కమిటి మాత్రం కొంత కాలం పాలన పొడగించినప్పటికీ హైకోర్టు ఆదేశాలతో తాజాగా ప్రభుత్వం సెస్‌కు పాలకవర్గ ఎన్నికలు నిర్వహించడానికి నిర్ణయించడం, ఉన్న ఫలంగా ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఖరారుపై మల్లగుల్లాలు సాగుతున్నాయి. అయితే అధికార టి ఆర్ ఎస్ మాత్రం ఊపులో ఉండగా, మిగితా కాంగ్రెస్, టిడిపి, బిజెపిల నుండి అంతగా స్పందన కనిపించడం లేదు. ఉన్నా సెస్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో వారి బలం లేకపోవడంతో అధికార పార్టీకే ఎక్కువ లాభం చేకూరే అవకాశాలు ఏర్పడ్డాయి. సెస్ పరిధిలోని తొమ్మిది మండలాలను 11 నియోజకవర్గాలుగా ఖరారు చేశారు. మండలానికి ఒక నియోజకవర్గంగా నిర్ణయం తీసుకోగా, సిరిసిల్ల, వేములవాడ పట్టణాల కోసం అర్బన్ నియోజకవర్గాలు, మండలంలోని గ్రామాలను రూరల్ నియోజకవర్గాలుగా విభజించి, మొత్తం 11 నియోజకవర్గాలుగా ఖరారు చేశారు. నియోజకవర్గానికి ఒక డైరెక్టర్‌ను సెస్ వినియోగదారులు ఓటు వేసి నేరుగా ఎన్నుకుంటారు. అనంతరం ఎన్నికైన డైరెక్టర్లు చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. కాగా సెస్ పరిధిలో విద్యుత్ మీటరు కలిగిన ప్రతీ వినియోగదారుడు ఓటరుగా ఉంటారు. అయితే వినియోగదారుడు ఎన్ని విద్యుత్ మీటర్లు కలిగి ఉన్నప్పటికీ ఒకే ఓటును వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం ఈసారి అకారణంగా ఓటర్ల జాబితాలో ఒకటి కంటె ఎక్కువ సార్లు నమోదై ఉన్న 26,213 మందిని డూప్లికేట్ ఓటర్లుగా సెస్ అధికారులు గుర్తించారు. వీటిని తొలగిస్తూ, అభ్యంతరాలను ఈనెల 25వ తేదీలోగా ఆహ్వానించారు. అభ్యంతరాల అనంతరం ఒకే పేరుతో ఉన్న పలు డూప్లికేట్ ఓటర్లను జాబితా నుండి శాశ్వతంగా తొలగిస్తూ, ఎన్నికల ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఇది ఇలా ఉండగా ఇప్పటికే ప్రజాప్రతినిధిగా ఉన్న వారు సెస్‌కు పోటీ చేసి ఎన్నికైతే 15 రోజుల్లో ఏదో ఒక పదవిని మాత్రమే ఉంచుకుని, ఇతర పదవికి రాజీనామా చేయాల్సి ఉండడంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశలు పెట్టుకున్న మున్సిపల్ కౌన్సిలర్లు, జడ్పిటిసి తదితర ప్రజా ప్రతినిథులు విస్మయానికి గురవుతున్నారు. కాగా సెస్ పరిధిలోని తొమ్మిది మండలాలలో ఎన్నికల కోలాహలం ప్రారంభం కావడంతో పార్టీల ప్రమేయం లేకుండా జరుగుతున్న సెస్ పోరు కోసం రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఖరారుపై దృష్టిసారించాయి.