బిజినెస్

ఒన్‌ప్లస్ బైబ్యాక్ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 4: అంతర్జాతీయ ప్రీమియం స్మార్ట్ఫోన్ కంపెనీ ఒన్ ప్లస్ ఇక్కడ అధికారికంగా బైబ్యాక్ కార్యక్రమాన్ని ఈ స్టోర్ ఒన్‌ప్లస్ డాట్ ఇన్‌లో ప్రకటించింది. ఈ సందర్భంగా ఒన్ ప్లస్ ఇండియా జనరల్ మేనేజర్ వికాస్ అగర్వాల్ మాట్లాడుతూ, ఈ విధానం ద్వారా వినియోగదారులు తమ ప్రస్తుత పరికరాన్ని మార్చుకుని అత్యాధునిక ఒన్‌ప్లస్ డివైజ్‌ను సొంతం చేసుకోవచ్చని, ఈ కార్యక్రమాన్ని 30 నగరాల్లో అమ లు చేస్తున్నామని అన్నారు.
వినియోగదారులు పాత మొబైల్ ఫోన్‌కు సంబంధించిన కోట్‌ను దాని వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. బైబ్యాక్ వివరాలను పరిశీలించిన తర్వాత నూతన ఒన్‌ప్లస్ డివైజ్‌ను కొనుగోలు చేయవచ్చన్నారు. ఒన్‌ప్లస్ అనేది అంతర్జాతీయ మొబైల్ టెక్నాలజీ కంపెనీ అని ఆయన చెప్పారు.
టీ-సాట్‌లో పశుసంవర్థకంపై
రేపు ప్రత్యేక కార్యక్రమం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 4: టి-సాట్ ప్రసారం చేసే వ్యవసాయ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం ‘పశు సంవర్థక పథకాలు-పశు వైద్య ఆరోగ్య సేవలు’ అంశంపై రైతులకు సూచనలతో ఒక కార్యక్రమం టెలికాస్ట్ చేస్తున్నామని టి-సాట్ సిఇఓ ఆర్. శైలేష్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశం రైతులకు సూచనలు సలహాలు ఇస్తారన్నారు. మంగళవారం సాయం త్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని శైలేష్‌రెడ్డి వివరించారు. ఇలా ఉండగా ప్రతిసోమవారం సాయంత్రం 4 గంటల నుండి ఐదు గంటల వరకు జరిగే ప్రత్యక్ష ప్రసారాల్లో రైతులు తమ అనుమానాలను ప్రశ్నల రూపంలో అడిగి నివృత్తి చేసుకోవచ్చని వివరించారు.