కరీంనగర్

రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఫిబ్రవరి 5: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై రైతు లోకం ఉద్యమించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక బద్ధం ఎల్లారెడ్డి భవన్‌లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ట్రాక్టర్లలో పూర్తిగా గోల్‌మాల్ జరుగుతోందని, టీఆర్‌ఎస్ కార్యకర్తలకే ట్రాక్టర్లు చెందుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతు సమన్వయ కమిటీలకు రూ.500 కోట్లు కేటాయించిందని, అవి ఇప్పటికీ రాష్ట్రంలో ఎక్కడా ఉపయోగించకపోవడం చూస్తుంటే కేసీఆర్‌కు రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 3,500 మంది రైతులు తమ ప్రాణాలను బలి తీసుకున్నారని, అసమర్థ ప్రభుత్వ విధానాలే రైతు ఆత్మహత్యలకు కారణమని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులు క్రమ పద్ధతిన కట్టడం లేదని, పూర్తిగా కాంట్రాక్టర్లు, టీఆర్‌ఎస్ నాయకులు ఇష్టారాజ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు అడ్డగోలుగా రేట్లు పెంచుకొని ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఎకరాకు నాలుగు వేలు ఇస్తామంటే మేము స్వాగతించామని, కానీ దాన్ని కూడా పక్కదారి పట్టించే కుట్ర జరుగుతోందని అన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తానని గొప్పలు చెప్పిన కేసిఆర్ వారం తిరగకముందే తొమ్మిది గంటలకు మార్చడాన్ని కేసిఆర్ నిర్ణయాలన్నీ తుగ్లక్ నిర్ణయాలేనని తేలిపోయిందని ఏద్దేవా చేశారు. రైతు సంఘం నిర్మాణాన్ని గ్రామ గ్రామాన బలోపేతం చేయాలని, రైతు సమస్యలపై సంఘటితం చేస్తూ పోరాటాలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. రైతు సంఘం అధ్యక్షుడు అందె స్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు పొనగంటి కేదారి, ఉమ్మెంతల రవీందర్ రెడ్డి, నాగెల్లి లక్ష్మారెడ్డి, మల్లేశం, పొన్నం కనుకయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ
కరీంనగర్ రూరల్, ఫిబ్రవరి 5: కొత్తపల్లి మండలంలోని సీతారాంపూర్‌లోని ఎస్.ఆర్.నగర్‌లో సోమవారం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇజిఎస్ నిధులు రూ.15లక్షలు, గ్రామ పంచాయితీ నిధులు రూ.25 లక్షలతో మురికికాలువ, సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిషలు కృషిచేస్తున్నామని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో కరీంనగర్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ఇంకా పూర్తికాని పనులు, రోడ్లను వెంటనే పూర్తి చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జంగిలి సాగర్, జడ్పిటిసి ఎడ్ల శ్రీనివాస్, ఎంపిపి వాసాల రమేష్, ఎంపిటిసిలు పాదం మాలతి-రాజు, వ్యవసాయ మార్కెట్ కమిటి ఉపాధ్యక్షుడు జువ్వాడి రాజేశ్వర్‌రావు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.