బిజినెస్

లాభాల స్వీకరణతో మార్కెట్లపతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 14: నిరర్ధక ఆస్తుల సమస్య పరిష్కారం విషయంలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బ్యాంకులకు కఠినమయిన మార్గదర్శకాలను జారీ చేయడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో బ్యాంకింగ్ షేర్ల ధరలు పడిపోవడంతో పాటు తరువాత మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల మార్కెట్ కీలక సూచీలు బుధవారం పతనమయ్యాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) తన శాఖలలో రూ. 11,335 కోట్ల మేరకు మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన తరువాత బుధవారం ఆ బ్యాంకు షేర్ల విలువ 9.81 శాతం దిగజారింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ప్రపంచ, దేశీయ పరిణామాలు సానుకూలంగా ఉండటంతో బుధవారం 34,436.98 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, ఇంట్రా-డేలో 34,473.43 పాయింట్లను తాకింది. అయితే, తరువాత మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో 34,028.68 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 144.52 పాయింట్ల (0.42 శాతం) నష్టంతో 34,155.95 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ బుధవారం 38.85 పాయింట్లు (0.37 శాతం) దిగజారి, 10,500.90 పాయింట్ల వద్ద స్థిరపడింది. సోమవారం మార్కెట్ పనివేళలు ముగిసిన తరువాత వెలువడిన గణాంకాల ప్రకారం, మాన్యుఫాక్చరింగ్, క్యాపిటల్ గూడ్స్ రంగాల పనితీరు మెరుగుపడటంతో డిసెంబర్ నెలలో పారిశ్రామిక ఉత్పత్తి 7.1 శాతం పెరిగింది. మరోవైపు, జనవరి నెలలో చిల్లర ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గి 5.07 శాతానికి చేరుకుంది. చిలర్ల ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 17 నెలల గరిష్ఠ స్థాయి 5.21 శాతానికి చేరుకుంది. పటిష్ఠమైన ఐఐపీ వృద్ధితో పాటు ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు పటిష్ఠమైన స్థాయి వద్ద ప్రారంభం అయ్యాయి. అయితే, పాడు రుణాల సమస్య పరిష్కారం విషయంలో ఆర్‌బీఐ జారీ చేసిన జటిలమయిన మార్గదర్శకాలతో బ్యాంకింగ్ రంగ షేర్ల ధరలు పడిపోయాయి. ఇదిలా ఉండగా, సోమవారం ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ. 814.11 కోట్ల విలువయిన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 1,342.70 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు.
బుధవారం నాటి లావాదేవీల్లో బ్యాంకింగ్ రంగంలో యెస్ బ్యాంక్ 4.40 శాతం, ఎస్‌బీఐ 4.06 శాతం, యాక్సిస్ బ్యాంక్ 3.35 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.29 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 1.75 శాతం చొప్పున నష్టపోయాయి. షేర్ల ధరలు పడిపోయిన ఇతర కంపెనీలలో ఓఎన్‌జీసీ, సన్ ఫార్మా, టీసీఎస్, పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ, ఐటీసీ, బజాజ్ ఆటో, మారుతి సుజుకి, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, ఇన్ఫోసిస్, కోటక్ మహింద్రా బ్యాంక్, ఆసియన్ పెయింట్స్ ఉన్నాయి. వీటి షేర్ల విలువ 2.62 శాతం వరకు పడిపోయింది. అయితే, కోల్ ఇండియా, రిల్, విప్రో, భారతి ఎయిర్‌టెల్, అదాని పోర్ట్స్, టాటా మోటార్స్, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, హెచ్‌యూఎల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్ల విలువ 2.47 శాతం వరకు పెరిగింది. బీఎస్‌ఈ మిడ్-క్యాప్ ఇండెక్స్ 0.17 శాతం, స్మాల్-క్యాప్ ఇండెక్స్ 0.16 శాతం చొప్పున పెరిగాయి.