బిజినెస్

కైకలూరులో టెక్నాలజీ అప్లికేషన్ సెంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 14: విజయవాడ వద్ద జనవరిలో తమ మొదటి చేప మేత ప్లాంట్‌ను ప్రారంభించిన తరువాత కార్గిల్ సంస్థ ఇప్పుడు తమ మొదటి టెక్నాలజీ అప్లికేషన్ సెంటర్‌ను కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలో బుధవారం ప్రారంభించింది. ఈ టెక్నాలజీ అప్లికేషన్ సెంటర్ ద్వారా ఆక్వాకల్చర్ రైతులు నూతన ఆవిష్కరణలు పొందడంలో సహాయపడటంతో పాటుగా ఆరోగ్యకరమైన సముద్ర ఉత్పత్తులు పెంచడానికి తగిన పరిష్కారాలను అందించనుంది. ఈ సెంటర్‌లో శిక్షణ సదుపాయం, పరిశోధనా కేంద్రం సైతం ఉండి ఆక్వాకల్చర్ ఫీడ్ డెవలప్‌మెంట్‌లో ఆవిష్కరణలకు మద్దతు అందిస్తుంది. ఆక్వాకల్చర్ పరిశోధన, అభివృద్ధి పరంగా దక్షిణాసియాలో కార్గిల్‌కు ఇది అతి పెద్ద పెట్టుబడిగా నిలుస్తుంది. 2018 సంవత్సరం మధ్య నాటికి కార్గిల్ తమ నూతన టెక్నాలజీ అప్లికేషన్ సెంటర్‌లను ఆక్వా కల్చర్‌కు సంబంధించి నాలుగు దేశాల్లో ప్రారంభించనుంది. వీటిలో వియత్నాం, థాయ్‌లాండ్, ఇండోనేషియా, ఇండియా ఉన్నాయి. ‘్భరతదేశం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆక్వాకల్చర్ మార్కెట్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌లో వేగాన్ని ఈ సెంటర్ కార్గిల్‌కు అందించడంతోపాటుగా విజయవాడలోని మా నూతన ఫిష్‌ఫీడ్ ప్లాంట్, రాజమండ్రిలోని రొయ్యల మేత ప్లాంట్ ద్వారా చేప, రొయ్య రైతులకు అత్యుత్తమ మేత పరిష్కారాలను సైతం అందించనుంది, ఈ సెంటర్ భారతీయ ఆక్వాకల్చర్ పరిశ్రమకు కార్గిల్ మద్దతును గణనీయంగా వృద్ధి చేయనుంద’ని కార్గిల్ ఆక్వాకల్చర్ న్యూట్రిషన్ బిజినెస్ - దక్షిణాసియా ఎండీ చాద్ గౌగెర్ అన్నారు. ఈ కేంద్రం చేప, రొయ్యల రైతులకు మేతను వినియోగించడంపై శిక్షణ అందించడంతో పాటుగా అత్యుత్తమ విధానాలను అనుసరించడంలో సహాయపడుతుంది.

నకిలీ పురుగు మందులపై నిషేధం
తెలంగాణ
వ్యవసాయ శాఖ చర్య
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 14: ‘క్రిస్’ పేరుతో మార్కెట్లో ఉన్న పురుగు మందును తెలంగాణ వ్యవసాయ శాఖ నిషేధించింది. ఇది నాసిరకం మందుగా పరీక్షా కేంద్రంలో తేలింది. అలాగే ‘కిమిట్’ పేరుతో మార్కెట్లో ఉన్న మరొక పురుగు మందును కూడా నిషేధించారు. కిమిట్ పేరుతో అమ్మకం అవుతున్న పురుగు మందు కూడా నాసిరకం అని తేలడంతో నిషేధం విధించారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని వ్యవసాయ సంచాలకులు-2 (సస్య రక్షణ) ఒక ప్రకటనలో కోరారు.