ఆంధ్రప్రదేశ్‌

పోలవరం @ 53 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 14: జాతీయ ప్రాజెక్టైన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకూ 12వేల 910 కోట్ల్లు ఖర్చు చేసి 53 శాతం పనులు పూర్తి చేశామని రాష్ట్ర జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఈమేరకు బుధవారం వెలగపూడి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టు వివరాలు ప్రత్యేక వెబ్‌సైట్లో పొందుపర్చామని, వివరాలను ఎవరైనా తెలుసుకోవచ్చన్నారు. దేశంలో ఇంతకుముందు ఏ ప్రాజెక్టు వివరాలనూ ఇలా వెబ్‌సైట్లో పెట్టలేదన్నారు. పోలవరం ప్రాజెక్టును సీఎం ఇప్పటివరకూ 51సార్లు వర్చువల్ తనిఖీల ద్వారా సమీక్షించారన్నారు. కుడి ప్రధాన కాలువకు సంబంధించి 91శాతం, ఎడమ కాలువకు సంబంధించి 60శాతం పనులు, హెడ్‌వర్క్సుకు సంబంధించి 39శాతం, డ్యాం, స్పిల్ వేకు సంబంధించి 71శాతం పనులు పూర్తయ్యాయని, వచ్చే 2019 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. డిసెంబర్ నాటికి 48గేట్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రాజెక్టుపై ఇప్పటి వరకూ 12వేల 910కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, తమ ప్రభుత్వం వచ్చాక 7 వేల 79 కోట్లు ఖర్చు చేయగా 2014కు ముందున్న ప్రభుత్వాలు 5వేల 135కోట్లు ఖర్చు చేశాయన్నారు. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం 4వేల 932కోట్ల విడుదల చేయగా, మరో 2వేల 247 కోట్లను విడుదల చేయాల్సి ఉందన్నారు. వచ్చే సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం స్వయంగా తనిఖీ చేయనున్నారని మంత్రి వెల్లడించారు. సోమవారంలోగా బ్యాలెన్సు పనులకు సంబంధించిన పూర్తి వివరాల నివేదికను సమర్పించాలని సీఎం ఆదేశించారన్నారు. ఈ ప్రభుత్వం ప్రాధాన్యతగా పెట్టుకున్న 28 ప్రాజెక్టుల్లో ఇప్పటికే 6 ప్రాజెక్టులు పూర్తి చేయగా, మరో 12 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని మంత్రి దేవినేని వెల్లడించారు. పూర్తిచేసిన ప్రాజెక్టులను 116రోజుల పాటు సాగే జలసంరక్షణ కార్యక్రమంలో ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో జల సంరక్షణ పనులకు ఇప్పటి వరకూ 10వేల 867కోట్ల రూపాయలను ఖర్చు చేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3మీటర్ల కంటే తక్కువ భూగర్భ జలమట్టం గల మండలాలు, 8 మీటర్ల కంటే ఎక్కువ మట్టం గలవి 411 మండలాలున్నాయని వివరించారు. రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల గురించి మంత్రి దేవినేని మాట్లాడుతూ వంశధార-నాగావళి అనుసంధానంతో రెండు పంటలకు నీరందిస్తామన్నారు. అలాగే విశాఖ జిల్లాలో 2లక్షల ఎకరాలకు నీరందించనున్నామని, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని మార్చి నాటికి పూర్తి చేయనున్నామని, దీనిద్వారా ఏలేరు రిజర్వాయర్లో నీటిని నిల్వచేసి తూర్పు గోదావరి మెట్ట ప్రాంత మండలాల్లో లక్ష ఎకరాలకు నీరందించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణాడెల్టాలో 13వేల ఎకరాలకు నీరందించడంతో ఈ ఏడాది 10వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, దీనిద్వారా పశ్చిమ గోదావరి జిల్లాల్లో 7లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందే వీలుందన్నారు. గోదావరి-పెన్నా అనుసంధానానికి సీఎం చర్యలు తీసుకుంటున్నారన్నారు. డిసెంబర్ నాటికి వెలిగొండ టనె్నల్-1 పనులు పూర్తి చేయనున్నామని మంత్రి దేవినేని వెల్లడించారు. సమావేశంలో జలవనరుల శాఖ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లో ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి చరిత్ర, ప్రాజెక్టు మొత్తం వివరాలు, ప్రస్తుత స్థితి, ఇప్పటి వరకూ పూర్తయిన వివరాలు, ఖర్చు చేసిన వ్యయం వివరాలను అందుబాటులో ఉంచామన్నారు. ఇందుకు సంబంధించి జిల్లాల వారీగా వివరాలు తెల్సుకోవాలంటే పశ్చిమ గోదావరి జిల్లాకు ఒక లింక్, తూర్పు గోదావరి జిల్లాకు ఒక లింక్ ఏర్పాటు చేశామన్నారు. అలాగే ముఖ్యమంత్రి ప్రతి సోమవారం చేస్తున్న వర్చువల్ తనిఖీల వివరాలు, భూసేకరణ, సహాయ పునరావాస చర్యల వివరాలు దీనిలో పొందుపర్చామన్నారు. ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకూ విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు, సమావేశాల మినిట్స్, వివిధ సందర్భాల్లో తరచు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు, అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల ఫోన్ నెంబర్ల వివరాలను కూడా ఈ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచామని వివరించారు.