బిజినెస్

ఇరుక్కున్న బ్యాంకులెన్ని?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: సంచలనాత్మక పంజాబ్ నేషనల్ బ్యాంకు భారీ కుంభకోణం నేపథ్యంలో ఇతర బ్యాంకుల తీరుపైనా దర్యాప్తు సాగుతోంది. ముఖ్యంగా పీఎన్బీ దర్యాప్తు వేగాన్ని సంతరించుకుంటున్న కొద్దీ దేశంలోని బ్యాంకుల విదేశీ విభాగాల్లోని అధికారుల చర్యలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏయే బ్యాంకు ల్లో తప్పుడు పద్ధతుల్లో లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్స్ (రుణ చెల్లింపు హామీ పత్రాలు) జారీ అయ్యాయో అధికారులు నిగ్గుదేలుస్తున్నారు. గత ఏడేళ్లుగా జరిగిన ఈ భారీ కుంభకోణంతో అలహాబాద్ బ్యాంకు, ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు, యూకో బ్యాంకు, యాక్సిస్ బ్యాంకులకు చెందిన హాంకాంగ్ బ్రాంచిల్లోని అధికారులకు ప్రమేయం ఉన్నట్టుగా తేలడంతో వీటన్నింటిపైనా దర్యాప్తు విభాగాలు దృష్టి పెట్టాయి. ఎల్‌వోయు జారీ అయిన తరువాత ముఖ్యంగా వజ్రాలు, ఆభరణాల రంగానికి సంబంధించి వాటిని ఎన్‌క్యాష్ చేసుకునేందుకు 90 నుంచి 365రోజుల గడువుంటుంది. ఎప్పుడైతే ఈ కుంభకోణం బయటపడిందో ఇతర బ్యాంకుల విదేశీ విభాగాల అధికారులు అప్రమత్తమై ఉండాల్సిందని, కానీ గత నెలలో పీఎన్బీ కుంభకోణం వెలుగు చూసే వరకూ కూడా ఈ బ్యాంకుల్లో ఏవిధమైన కదలికా రాలేదని అధికార వర్గాలు చెబుతున్నారు. నిజానికి ఈ అక్రమ ఎల్‌వోయులకు సంబంధించి ఇతర బ్యాంకుల అధికారులు ముందుగానే అప్రమత్తమై ఉండివుంటే ఈ కుంభకోణం ఇంత భారీ స్థాయికి చేరుకుని ఉండేదికాదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.
హాంకాంగ్‌లో 11 భారతీయ బ్యాంకులకు విభాగాలు ఉన్నాయి. పీఎన్బీ కుంభకోణం వల్ల నష్టపోయిన బ్యాంకుల్లో దేశంలోని అతి పెద్ద ఎస్బీఐ కూడా ఉంది. అలాగే, మరో ప్రభుత్వరంగ బ్యాంకు అయిన యూనియన్ కూడా దాదాపు 300 మిలియన్ డాలర్లమేర రుణాలిచ్చింది. యూకో బ్యాంకు సైతం 411.82 మిలియన్ డాలర్లు, అలాగే అలహాబాద్ 2వేల కోట్ల రూపాయల మేర ఎల్‌వోయుల ఆధారంగా రుణాలిచ్చినట్టు తెలుస్తోంది.