బిజినెస్

కట్టాల్సింది 5వేల కోట్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 20: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)కి తాను చెల్లించాల్సిన 11,400 కోట్ల బకాయిల విషయంలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ చేతులెత్తేశారు. అసలు తానంత మొత్తాన్ని బాకీపడలేదని, తాను చెల్లించాల్సింది కేవలం 5వేల కోట్ల రూపాయలేనని వెల్లడించారు. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు తాను ఎంతగా ప్రయత్నించినా అత్యుత్సాహంతో వ్యవహరించి బాకీలు తీర్చేందుకు తనకు ఉన్న అన్ని మార్గాలనూ మూసేశారని ఆరోపించారు. ఈనెల 16న పీఎన్‌బీ యాజమాన్యానికి రాసిన లేఖలో ఈ మొత్తం వ్యవహారాన్ని నీరవ్‌మోదీ వివరించారు.పైగా ఈ కేసులో అమాయకులైన తన బంధువులను ఇరికించారని ఈ వ్యవహారంతో వారికి ఎలాంటి సంబంధం లేదని ఆ లేఖలో మోదీ పేర్కొన్నారు. ఎప్పుడైతే ఈ వ్యవహారం మీడియాకు పొక్కిందో బకాయిల మొత్తం అనూహ్యంగా పెరిగిపోయిందని, తన వ్యాపారాలు, కార్యాలయాలపై అధికారుల దాడులతో ఫైర్‌స్టార్ ఇంటర్నేషనల్, ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ వ్యాపారాలూ మూతబడ్డాయని తెలిపారు. ఫలితంగా బ్యాంకులకు బకాయిలు చెల్లించేందుకు తనకు గల ఆర్థిక సామర్ధ్యం అడుగంటిపోయిందని వెల్లడించారు.‘మీ బకాయిలను వెంటనే వసూలు చేసుకునేందుకు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు.
వీటిని చెల్లించేందుకు ఈనెల 13నే నేను ముందుకొచ్చాను. కానీ ఆ మర్నాడే మీరు వీధికెక్కారు. ఫలితంగా నా వ్యాపారాలు, బ్రాండ్ ఇమేజ్ దారుణంగా దెబ్బతిన్నాయి. అంతేకాదు బకాయిలు వసూలు చేసుకునేందుకు మీకున్న అవకాశాలు తగ్గిపోయాయి’అని నీరవ్ మోదీ తన లేఖలో స్పష్టం చేశారు. బకాయిలు చెల్లింపు విషయంలో పీఎన్‌బీకి తనకు జరిగిన చర్చల వివరాలు, అలాగే ఈమెయిల్ సంభాషణల గురించి మోదీ ఆ లేఖలో పేర్కొన్నారు. మొత్తం 11వేల కోట్ల రూపాయలకుపైగా తాను బాకీ పడినట్టుగా మీడియా కథనాల్లో ఎంతమాత్రం నిజం లేదని, ఈ మొత్తం చాలా తక్కువని వివరించారు. పీఎన్‌బీ అధికారులు తనపై ఫిర్యాదు చేసినప్పటికీ తాను సదుద్దేశంతో ఓ లేఖ రాశానని, ఫైర్‌స్టార్ గ్రూపుకంపెనీలను అమ్మేసి బాకీలకు జమకట్టుకోండని చెప్పానని అయినా వారు అంగీకరించలేదని నీరవ్ ఆరోపించారు. తన వ్యావార సంస్థల మొత్త విలు వ 6,500 కోట్ల రూపాయలకు పైగానే ఉం టుందని ఆయన అన్నారు. ఇప్పుడు తన బ్యాంకు ఖాతాలన్నీ జప్తుఅయ్యాయని, ఆస్తులను స్తంభింపచేశారని పేర్కొ న్న నీరవ్ ఇప్పుడు ఈ మొత్తాన్నీ చెల్లించడం సాధ్యంకాదని తేల్చేశారు. పీఎన్‌బీ నుంచి తన కంపెనీకి, తన భాగస్వామ్య సంస్థలకు లభించిన రుణాలు తిరిగి చెల్లించే విషయంలో కొనే్నళ్లుగా ఎలాంటి డిఫాల్ట్ లేదని ఆయన తెలిపారు. ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ కంపెనీలు ఇంత వరకూ రుణాలు చెల్పింపువిషయంలో జాప్యం చేయలేదని, తమ బకాయిల విషయంలో బ్యాంకులు సురక్షితంగా ఉండొచ్చని అవన్నీ సెక్యూర్డ్ రుణాలేనని చెప్పారు. బయ్యర్స్ క్రెడిట్ ఫెసిలిటీ చార్జీల రూపంలో పీఎన్‌బీకి తాను కోట్లాది రూపాయలకు కట్టానని నీరవ్ వెల్లడించారు. ఈ మూడు కంపెనీలు తన గ్రూపునకు చెందిన ఇతర ఆస్తులు విక్రయిస్తే బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం ఎప్పుడో తీరిపోయేదని అయితే ఇప్పుడా అవకాశం చేయిదాటిపోయిందని మోదీ అన్నారు. ఈ బకాయిల విషయంలో నిష్పాక్షికంగా ఉండాలని పీఎన్‌బీని కోరిన నీరవ్ తన కంపెనీలతో సంబంధం లేని తన సోదరుణ్ని ఇరికించారని, అలాగే తన భార్య కూ ఈ వ్యవహరాలతో ఎలాం టి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలన్నీ తన సొంత వ్యవహారాలతోనే సాగాయని, వీటితో వారెవరికీ ఎలాంటి సంబంధం లేదని అన్నారు.
chitram...
నీరవ్‌మోదీ బంధువులకు చెందిన గిలి జ్యూవెలర్ స లో సోదాలు చేసి నగదు, నగలు, కొన్ని విలువైనె పత్రాలను స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు