కృష్ణ

సహకార వ్యవస్థకు సహకార సంఘాలే మూలస్థంభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, ఫిబ్రవరి 21: సహకార వ్యవస్థకు సహకార సంఘాలే మూల స్థంభాలని అప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం స్థానిక వాసవీ కన్యకా పరమేశ్వరి కల్యాణ మండపంలో నాగాయలంక మండలంలోని పీఎసీఎస్ అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పిన్నమనేని మాట్లాడుతూ సహకార వ్యవస్థలో రైతుల ప్రయోజనాలే ప్రధానంగా వివిధ రకాల రుణాలను అందించడం జరుగుతోందన్నారు. ఒక్కొక్క రైతుకు రూ.10లక్షలు వరకు రుణాలు ఇచ్చే అవకాశం సహకార వ్యవస్థలో మాత్రమే ఉందన్నారు. సహకార సంఘాలు వ్యాపార ధోరణితో వ్యవహరించాల్సి ఉందన్నారు. జాతీయ బ్యాంక్‌లకు ధీటుగా గ్రామాల్లో పీఎసీఎస్‌ల ద్వారా ఎరువులు, క్రిమి సంహారక మందులు, బంగారు అభరణాలపై రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కెడీసీసీ బ్యాంక్ సీఇఓ సుబ్రహ్మణ్యం, డైరెక్టర్ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

‘టెట్’ తొలి రోజు ప్రశాంతం

మచిలీపట్నం (కల్చరల్), ఫిబ్రవరి 21: జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్) తొలి రోజు ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 16 కేంద్రాల్లో పేపర్-1, పేపర్-2 పరీక్ష నిర్వహించారు. ఉదయం నిర్వహించిన పేపర్-1 పరీక్షకు 3వేల 124 మంది అభ్యర్థులు హాజరు కావల్సి ఉండగా 2వేల 851 మంది హాజరయ్యారు. 273 మంది గైర్హాజరయ్యారు. హాజరు శాతం 91గా నమోదైంది. మధ్యాహ్నం నిర్వహించిన పేపర్-2 పరీక్షకు 3వేల 124 మంది అభ్యర్థులకు గాను 2వేల 961 మంది హాజరయ్యారు. 163 గైర్హాజరు కాగా హాజరు శాతం 95 శాతంగా నమోదైంది. విజయవాడలోని రెండు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం, జిల్లా విద్యా శాఖాధికారిణి ఎంవి రాజ్యలక్ష్మి తనిఖీ చేశారు.