కృష్ణ

విభజన హామీలు అమలు చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఫిబ్రవరి 22: రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో ఆమోదించిన హామీలన్నీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని తెలుగుదేశం మండల పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. గురువారం మండలంలోని వెల్వడంలో తెలుగుదేశం పార్టీ మండల కార్యకర్తల సమావేశం పార్టీ అధ్యక్షులు తాతా పోతురాజు అధ్యక్షతన జరిగింది. ఈసమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కోమటి సుధాకర్ మాట్లాడుతూ ఆనాడు ప్రత్యేక హోదా ఇవ్వమంటే నిబంధనలు అడ్డు వస్తున్నాయని చెప్పి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పారని కానీ నేడు కనీసం బడ్జెట్‌లో కూడా దానికి సంబంధించిన నిధులు ఇవ్వకపోవటం శోచనీయమన్నారు. ఇప్పటికైనా రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోతే ప్రత్యేక హోదాకోసం తాము కూడా ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎంపీపీ బాణావతు లక్ష్మి, జడ్పీటీసీ దొండపాటి రాము మాట్లాడుతూ విశాఖ రైల్యే జోన్ విషయంలో కేంద్రం తాత్సారం చేయటం సమంజసం కాదన్నారు. ప్రత్యేక ప్యాకేజీకోసం ఎంపిలను రాజీనామా చేయిస్తానన్న జగన్ ఏడాది గడిచినా ఇంతవరకూ చేయించకుండా ప్రజలను మభ్యపెడుతున్నాడని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం శ్రమిస్తున్న మంత్రి సుజనాచౌదరిపై రాష్టప్రతికి ఫిర్యాదు చేయటం శోచనీయమన్నారు. జగన్ డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. అదేవిధంగా రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి రాకుండా కార్యకర్తలు గ్రామాల్లో అధికారులతో సమన్వయంగా పని చేసి తగిన చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి సుబ్బారావు, వైస్ ఎంపిపి ఇనుగంటి శోభన్‌బాబు, ఎంపీటీసీ వెంకటేశ్వరరావు, నేతలు శ్యామ్, జమలయ్య, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.