రాష్ట్రీయం

సముద్రాలు కలిపాయి ఒక్కటిగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: భౌగోళికంగా నౌకాదళం విడిపోయినా, సముద్రాలు మళ్లీ ఒక్కటిగా చేశాయని భారత నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ ఆర్‌కె ధావన్ అన్నారు. శుక్రవారం ఆయన విశాఖలో జాతీయ, అంతర్జాతీయ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫ్లీట్ రివ్యూ అనేది సంప్రదాయంగా వస్తోందన్నారు. 1953 నుంచి ఈ సంప్రదాయం ప్రారంభమైందని ఆయన చెప్పారు. 2001లో పశ్చిమ తీరంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో 24 దేశాల ప్రతినిధులు హాజరయ్యారని అన్నారు. ప్రస్తుత ఫ్లీట్ రివ్యూలో 50 దేశాల ప్రతినిధులు, 100కు పైగా యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయని ఆయన తెలియచేశారు. ఇందులో భారత నౌకాదళ నౌకలతోపాటు, వివిధ దేశాల నుంచి వచ్చిన యుద్ధ నౌకలు, కోస్ట్‌గార్డ్, వాణిజ్య నౌకలు, సబ్‌మెరైన్స్ పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నాయని ఆయన వివరించారు. భారత నౌకాదళం ఆవిర్భావం నుంచి సాధించిన విజయాలకు సూచికగా మారిటైం ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. భవిష్యత్‌లో స్వదేశీ పరిజ్ఞానానికి పెద్ద పీట వేస్తామని థవన్ స్పష్టం చేశారు. భారత దేశ శాస్తవ్రేత్తలు రక్షణ రంగానికి సంబంధించి చాలా కాలంగా చేస్తున్న ప్రయోగాలు, ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నాయని ఆయన చెప్పారు. గ్రీన్ నేవీగా భారత నౌకాదళం రూపుదిద్దుకోబోతోందని ఆయన వివరించారు. ఇందులో భాగంగా ఫాస్ట్ ఇంటర్‌సెప్టర్ క్రాఫ్ట్స్ వినామానాలు గ్రీన్ పెట్రోల్‌ను తొలిసారిగా వినియోగిస్తున్నాయని ఆయన చెప్పారు. అండమాన్‌లో ఓషన్ థర్మల్ కన్వర్షన్ ప్రాజెక్ట్‌ను పైలెట్ ప్రాజెక్ట్‌గా ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ యుద్ధ నౌకలను సమీక్షిస్తారని ఆయన చెప్పారు. ఏడవ తేదీన ఆర్‌కె బీచ్‌లో జరిగే ఆపరేషనల్ డెమోను ప్రధాని మోదీ పరిశీలిస్తారని ధావన్ చెప్పారు. మెరిటైం హెరిటేజ్‌పై రూపొందించిన పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరిస్తారని అన్నారు. వివిధ దేశాల నౌకాదళాల సిబ్బంది ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్‌లో పాల్గొంటారని అన్నారు. అలాగే వారివారి సంప్రదాయాలను తెలియచేసే ప్రదర్శనలు కూడా ఉంటాయని అన్నారు. 8వ తేదీన ముగింపు వేడుకలు జరుగుతాయని అన్నారు.