బిజినెస్

లాభాల బాటలో మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 23: ఈ నెలంతా నష్టాలనే చూసిన దేశీయ మార్కెట్లు తొలిసారిగా గణనీయమైన లాభాలను శుక్రవారం నాడు ఆర్జించాయి. బీఎస్‌ఈ సెనె్సక్స్ 323 పాయింట్లు లాభపడి, ఈ వారంలో అత్యధికంగా 34,142 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ విపణి స్థిరంగా ఉన్న నేపథ్యంలో తాజా పరిణామం మార్చిలో లాభాల దిశగా క్రయవిక్రయాలు సాగుతాయన్న భరోసా కలిగించింది. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ కాస్త పెరిగి 64.76గా నిలిచింది. శుక్రవారం ఉదయం బీఎస్‌ఈ సెనె్సక్స్ లాభాల దిశగా మొదలైంది. 33,832 పాయింట్లతో మొదలైన క్రయవిక్రయాలు ఒక దశలో 34,167 పాయింట్లకు చేరుకున్నప్పటికీ సాయంత్రానికి 34,142.15 వద్ద ముగిసింది. 322.65 పాయింట్లతో లాభాలను ఆర్జించింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా లాభాలను ఆర్జించింది. ఒక దశలో 10,499.10 పాయింట్లను తాకిన నిఫ్టీ చివరకు 10,491.05 పాయింట్ల వద్ద స్థిరపడి 131.39 పాయింట్లతో ఈ వారంలో అత్యధికంగా లాభాలను నమోదు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణం, ద్రవ్యోల్బణం ముప్పు పొంచి ఉందన్న ఆర్‌బీఐ హెచ్చరికల నేపథ్యంలో ఈనెలంతా ఒడుదుడుకులకు లోనైన స్టాక్‌మార్కెట్ మొత్తంమీద శుక్రవారం గాడిలో పడింది.