మెయిన్ ఫీచర్

మారాల్సిన అవసరం ఇంకా ఉంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంకోచోట అత్తగా ఉన్న మహిళ కోడలు ఉద్యోగిగా కష్టపడుతున్నా ఇంట్లో పనులు చక్కబెడుతున్నా సంతృప్తి చెందలేకపోతోంది. కనీసం చేయూత నివ్వకపోగా కొడుకు అనే పురుషునికి అండగా నిలిచి కోడలనే స్ర్తిని ఇబ్బంది పాలు చేయడంలో ముందేఉంటోంది. ఇది ఎంత వరకు సమంజసం? కొడుకు చేసే తప్పులను కూడా కోడలిమీదే ఎక్కుపెడుతోంది. మావాడు అమాయకుడన్న బిరుదులిస్తూ వారికి అండగా నిలవడం ఏంబాగుంది? సత్యమెక్కడుందో అక్కడ నిలవాల్సిన అవసరం ప్రతి స్ర్తి ఉంది కదా ఇది ఎందుకు ఆలోచించడంలేదు?

నేటి మహిళ ఎంత సంపాదనాపరురాలైనా మనదింకా పితృస్వామిక సమాజమే! అయినా మహిళలు ఎందులోను వెనక్కు తగ్గకుండా ఎన్నో రంగాల్లో ముందుకు దూసుకు పోతున్నారు. కాని ఎన్నో ఒడిదొడుకల నుంచి తప్పించుకోవాల్సి వస్తుంది. ఎన్నో మానిసక సంఘర్షణలు, మరెన్నో ఆర్థిక సంక్షోభాలు ఆమె ఎదుర్కొంటోంది. ఇది కాదనలేని నిజమే. ఒక్కోసారి మహిళను మరో మహిళ అర్థం చేసుకొనే పరిస్థితులు కూడా ఉండడం లేదు.
ఆర్థికంగా కాస్త వెనుకబడినాతల్లి స్థానంలో ఉన్న మహిళ ముందుగా కొడుకు చదువుకు ప్రాధాన్యత నిస్తోంది. నేడు కొడుకులు తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల పాలు చేసినపుడు అయ్యో నీకు నేను ఎంత చేసిన్రారా అని వాపోతుంది. ఇట్లాంటి సంఘటనలు ఎన్ని చూసినా ఇంకా స్ర్తి సంపూర్తిగా స్ర్తిల చదువు విషయంలో ముందుకు వచ్చి ఆలోచించడం లేదు. ఇది మారాల్సిన విషయమే.
ఇంకోచోట అత్తగా ఉన్న మహిళ కోడలు ఉద్యోగినా కష్టపడుతున్నా ఇంట్లో పనులు చక్కబెడుతున్నా సంతృప్తి చెందలేకపోతోంది. కనీసం చేయూత నివ్వకపోగా కొడుకు అనే పురుషునికి అండగా నిలిచి కోడలనే స్ర్తిని ఇబ్బంది పాలు చేయడంలో ముందునే ఉంటోంది. ఇది ఎంత వరకు సమంజం? కొడుకు చేసే తప్పులను కూడా కోడలిమీదే ఎక్కుపెడుతోంది. మావాడు అమాయకుడన్న బిరుదులిస్తూ వారికి అండగా నిలవడం ఏంబాగుంది. సత్యమెక్కడుందో అక్కడ నిలవాల్సిన అవసరం ప్రతి స్ర్తి ఉంది కదా ఇది ఎందుకు ఆలోచించడంలేదు.
అలాగే అమ్మ స్థానంలో ఉన్న స్ర్తిని విమర్శించడానికి అన్ని ఇన్ని కాదు తన కూతురు అత్తగారింటి నుంచి వచ్చినా లేక చదువుతూ వేరే ఊరినుంచి వచ్చినా అదీ కాక ఇంట్లోనే ఉన్నా సరే ఆ కూతురి స్థానంలో ఉన్న స్ర్తి మాత్రం అత్యంత అపురూపంగా చూస్తున్నారు. కాని అదే స్ర్తి కోడలి స్థానంలో ఉంటే ఎన్నో అవమానాలు, బరువులు బాధ్యత మోయవలసిందే. పని విషయంలోనే కాదు ఎన్నో విషయాల్లో తారతమ్యత చూపిస్తునే ఉన్నారు. అది మహిళలే మహిళలకు చేస్తున్న అన్యాయం కదా. అసమానతలు ఎందుకు? అందరూసమానంగా ఉంటే సమాజమే కాదు ఇల్లు ఆనందభైరవి రాగం ఆలపిస్తుందని మీకు తెలియదా? కోడలు నవ్వుతూ అమ్మవారింటి వారిలాగా అత్తింటి వారిని చూడాలి అంటే ఆమెను సొంత కూతురిగా చూసుకొంటే తన తల్లిరూపాన్ని అత్తలోనో, చెల్లి రూపాన్ని ఆడబడుచులోనో చూసుకుంటుంది కదా. ఇలా ఎందుకు మారరు.
ఇక ఆఫీసుల్లో అయితే మగ ఆఫీసర్లు అయితే తమ మీద జాలి చూపిస్తారని మహిళా ఆఫీసరు ఉంటే చండశాసనురాలు అవుతుందని మహిళలే కితాబులిస్తారు. అంటే ఒక మహిళ మరో మహిళను అర్థం చేసుకోవడం అంటే ఇంతేనా? ఇద్దరూ మహిళలూఒకే ఆఫీసుకే కదా పని చేస్తున్నారు. పని విభజన చేసుకోవడంలోను ఆఫీసర్లు గుమస్తాల మధ్య సామరస్యధోరణి ఉండదా? పెద్ద ఉద్యోగస్తులు , చిన్న ఉద్యోగస్తులన్న తేడానే కాని యజమాన్యానికి ఇద్దరూ ఒకటే కదా. ఇది ఎందుకు ఆలోచించరు?
ఇన్ని సమస్యల నిండా కూరుకొని పోయిన మహిళ ఎన్నో విధాలుగా తనకు తాను నచ్చచెప్పుకుంటూ సర్ధుబాటు చేసుకొంటూ తననే కాదు తన ఇంట్లోవారిని, కార్యాలయాల్లోవారిని కూడా తనవంతు బాధ్యతగా వారి అందరి సంతోషంగా కోసం తాను కొవ్వొత్తిలా కరిగిపోతుంది.
కనుక మహిళలూ మన కోసం మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక్కసారి మనమూ మనగురించి ఆలోచిద్దాం. ఆలోచనా సరళిని మార్చుకుంటే తారతమ్యాలు ఉండవు. సరిహద్దులు ఉండవు. ఆకాశ పధాన మనమేమిటో ప్రపంచానికి చాటి చెప్పవచ్చు ఆలోచించండి
మహిళలు ముందుకెళ్లాలంటే చట్టాలు, న్యాయాలు, మగవారి అండదండలు కాదు ముందు మనం మన తోటి మహిళ కష్టనష్టాల్ని సుఖదుఃఖాల్ని అర్థం చేసుకోవాలి. సంఘటిత శక్తిగా మహిళలు ఆవిర్భవించాలి. అపుడే మహిళ సాధికారత సాధించినట్టు అవుతుంది. అన్నింటా మహిళావిజయం తప్పక వస్తుంది.

- డేగల అనితాసూరి 9247500819