రాష్ట్రీయం

చత్తీస్‌గఢ్‌లో మావోల విధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, మార్చి 6: తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో దండకారణ్యంలో ఈ నెల 2న చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్ వేడి ఇంకా చల్లారలేదు. మావోయిస్టులు ఏవైపు నుంచి దాడులు చేస్తారోనని ఇరు రాష్ట్రాల పోలీసులు ఊపిరిబిగబట్టిన నేపథ్యంలో చత్తీస్‌గఢ్‌లో మంగళవారం మావోలు రెచ్చిపోయారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా డోర్నపాల్ పరిధిలోని పరిధిలోని కుడ్తి గ్రామం వద్ద తెలంగాణ- జగ్దల్‌పూర్ మార్గంలో తిరుగుతున్న ఏపీ 29జెడ్3500 నెంబర్ గల ఆర్టీసీ బస్సును మావోయిస్టులు అటకాయించి నిప్పు పెట్టి దగ్ధం చేశారు. ఈ సమయంలో బస్సులో 40 మంది వరకు ప్రయాణికులు ఉండగా వారిని కిందకు దిగమని హెచ్చరించిన మావోయిస్టులు అనంతరం బస్సును దగ్ధం చేశారు. ప్రయాణికుల ఎదుటే ఒకరిని దారుణంగా హతమర్చారు. మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి సస్పెండైన కానిస్టేబుల్‌గా తెలియవచ్చింది. కాగా ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా మావోయిస్టులు తెలంగాణలో అధికార పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని చెప్పిన 48 గంటల్లోనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సును దగ్ధం చేసి హెచ్చరికలు పంపారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు పరుగులు తీసి సమీపంలో ఉన్న సీఆర్‌పీఎఫ్ క్యాంపుకు చేరుకున్నారు. జరిగిన సంఘటనపై అధికారులకు వివరించారు. కాగా ఇదే ప్రాంతంలో మరొక ప్రైవేట్ బస్సును, టిప్పర్‌ను, ట్రాక్టర్‌ను కూడా మావోయిస్టులు దగ్ధం చేశారు. పూజారికాంకేర్ దండకారణ్యంలో జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమని, ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టులు అక్కడ వదిలిన కరపత్రాల్లో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈనెల 9న తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బంద్‌కు పిలుపునిస్తున్నట్లు మావోలు పేర్కొన్నారు. ఈ సంఘటనతో చత్తీస్‌గఢ్ ప్రభుత్వం అప్రమత్తమై వెంటనే రెడ్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణ డిపోకు చెందిన బస్సును మావోలు దగ్ధం చేయడంతో చత్తీస్‌గఢ్‌కు వెళ్లే బస్సులను ఆర్టీసీ నిలిపివేసింది. మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలకు రాత్రి వేళ వెళ్లే బస్సులను నిలిపివేస్తున్నారు.
chitram...
మావోయస్టులు తగులబెట్టిన తెలంగాణ ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ ట్రావెలర్స్ బస్సు