రాష్ట్రీయం

కత్తులతో బెదిరించి.. సిబ్బందిని బంధించి.. ఐదు కిలోల ఆభరణాలు చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 6: చార్మినార్‌లో దొంగలు రెచ్చిపోయారు. పక్కా ప్రణాళిక ప్రకారం ఆభరణాలు తయారు చేసే కార్ఖానాలో చొరబడి ఐదు కేజీల ఆభరణాలను దోచుకొని పారిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సిటీ ఆర్ముడ్ రిజర్వు పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలోని ఓ ఇంట్లో ఆభరణాలు తయారు చేసే కార్ఖనా కొనసాగుతుంది. మంగళవారం మధ్యాహ్నం సుమారు 15 మంది యువకులు కత్తులతో అందులోకి ప్రవేశించి సిబ్బందిని బెదిరించారు. అనంతరం వారిని బయటకు వెళ్లకుండా బంధించి అందులో ఉన్న బంగారన్నంతా తమ వెంట తెచ్చుకున్న బ్యాగుల్లో పెట్టుకొని పరార్ అయ్యారు. సిబ్బంది సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్, డాగ్ స్క్వాడ్‌లను అక్కడికి రప్పించి వివరాలను సేకరించారు. పోలీస్ జాగిలాలు పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపం వరకు వెళ్లి వెనుతిరిగినట్టు సమాచారం. చోరీ జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించేందుకు ప్రయత్నించగా అంతకుముందే వాటి వైర్లను తొలగించినట్టు పోలీసులు గుర్తించారు. డకాయిట్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఇప్పటికే ఈ కేసుతో సంబందం ఉన్న ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తున్నా అధికారులు నిర్థారించడం లేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
chitram...
హైదరాబాద్‌లో బంగారు ఆభరణాల దోపిడీ జరిగిన నేపథ్యంలో తనిఖీలను ముమ్మరం చేసిన పోలీసులు