రాష్ట్రీయం

సవాల్‌కు సిద్ధమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మార్చి 6: పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి దమ్ముంటే వారిని మళ్లీ గెలిపించుకోవాలని వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం చంద్రబాబుకి సవాల్ విసిరారు. మళ్లీ ప్రజలు ఓటు వేస్తారనే నమ్మకం లేకపోవడంతోనే చంద్రబాబు వారితో రాజీనామా చేయించడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని దోచుకున్న సొమ్ముతో విచ్చలవిడిగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయినా చంద్రబాబు పదవి వీడటం లేదని ఆక్షేపించారు. అంత దారుణంగా చంద్రబాబు చట్టాలను మేనేజ్ చేస్తున్నారని, ఇలాంటి రాజకీయాలను గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్న జగన్ మంగళవారం మధ్యాహ్నం చీరాల డివిజన్‌లోని ఇంకొల్లులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూసిన తరువాత ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు. ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా అన్న ఆయన అసలు అభివృద్ది అంటే ఏమిటి అని ప్రశ్నించారు. తన దృష్టిలో నిన్నటి కంటే ఇవాళ ఎక్కువ ఆనందంగా ఉండటం అభివృద్ధి అన్న ఆయన మరి నిజంగా రాష్ట్ర ప్రజల్లో ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా... అని ప్రశ్నించారు.
తమ పార్టీ అధికారంలోకి రాగానే చేయబోయే అంశాలను జగన్ వెల్లడించారు. వ్యవసాయానికి పగలే తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా, రైతులకు సున్నా వడ్డీకి పంట రుణాలు, ఆ మేరకు బ్యాంకులకు వడ్డీ మొత్తం చెల్లింపు, ఏటా సీజన్ ఆరంభానికి ముందు మే నెలలో ప్రతి రైతుకి పెట్టుబడిగా 12,500 రూపాయలు సహాయం, రైతులకు పెట్టుబడిని తగ్గించేందుకు ప్రతి రైతుకు ఉచితంగా బోరు బావి తవ్విస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేలా మూడు వేల కోట్ల తో ధరల స్థీరీకరణ నిధి ఏర్పాటు, ప్రతి పంటకు ముందే గిట్టుబాటు ధర ప్రకటించి ఆతరువాత కచ్చితంగా ఆ ధరకే కొనుగోలు చేస్తామన్నారు. ప్రతి కూల పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసి రైతులను నీరు సరఫరా చేస్తామన్నారు. చనిపోయిన తరువాత కూడా ప్రతి రైతు గుండెల్లో తాను ఉండాలని, వారి ఇంట్లో తన ఫోటో ఉండాలన్నదే ఆకాంక్ష అని, అందులో భాగంగా పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తున్నామన్నారు. పాడి ఇంట సిరులు దొర్లునంట, కవ్వమాడు ఇంట - కరువే ఉండదంట అన్న సామెతను జగన్ ప్రస్తావించారు. చంద్రబాబు సిఎం అయ్యేంత వరకు ఒంగోలు డైయిరీ మంచి లాభాల్లో ఉండేదని, కాని ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ సంస్థ 80 కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిందన్నారు. సహకార రంగంలోని డైయిరీ లను చంద్రబాబు నాశనం చేశారని ఆరోపించారు. అందుకే పార్టీ అధికారంలోకి రాగానే మూతపడిన డైయిరీ లను తిరిగి తెరిపిస్తామన్నారు. రైతుల నుండి సేకరించే పాలకు లీటరుకు నాలుగు రూపాయలు అదనంగా ప్రోత్సాహకాన్ని మొత్తాన్ని ఇస్తామని తెలిపారు. ఇంకా రైతులకు మేలు రకం ఆవులను కూడా ఇచ్చి వారిని అన్నీ విధాలుగా ఆదుకుంటామని జగన్ తెలిపారు.
chitram....
ఇంకొల్లులో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతున్న
వైఎస్‌ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి.