రాష్ట్రీయం

స్వయం సమృద్ధే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14 : ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంఘం, ఎపి బ్రాహ్మణ సహకార పరపతి సొసైటీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఈ సంఘం చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. బ్రాహ్మణ సంక్షేమ సంఘంతో పాటు ఎపి ఎండోమెంట్స్ అర్చకులు, ఇతర ఉద్యోగుల సంక్షేమ ఫండ్ ట్రస్ట్‌కు కూడా ఆయన చైర్మన్‌గా వ్యవహరిస్తారు. హైదరాబాద్ (తిలక్‌రోడ్, అబిడ్స్) లోని దేవాదాయ శాఖ ధార్మిక భవన్‌లో సంక్షేమ సంఘం కార్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆదివారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన తర్వాత ధార్మిక సంస్థల ద్వారా సేవ చేయాలని భావించానని, ముఖ్యమంత్రితో ఈ అంశంపై చర్చించానని కృష్ణారావు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహృదయంతో బ్రాహ్మణ సంక్షేమ సంఘంతో పాటు అర్చక సంక్షేమ ఫండ్ ట్రస్ట్ చైర్మన్ బాధ్యతలను అప్పగించారని తెలిపారు. ఈ సంస్థల కార్యకలాపాలన్నీ ఆన్‌లైన్ విధానంలో పనిచేస్తాయని, కంప్యూటర్ల ద్వారానే కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ఈ సంస్థల ద్వారా పేద బ్రాహ్మణులు, అర్హులైన బ్రాహ్మణులకు అందించేది సాయం మాత్రమేనని, దానం కాదని స్పష్టం చేశారు. ఈ సంస్థలను 10 సంవత్సరాల కాలంలో స్వయం సమృద్ధి సాధించేలా ప్రణాళికలను రూపొందిస్తామన్నారు. సంస్థ చైర్మన్‌గా తాను మూడు సంవత్సరాల పాటు కొనసాగతానని, ఈ కాలంలో సంస్థల అభివృద్ధి, స్వయంసమృద్ధి కోసం పాటుపడతానని వివరించారు. ప్రభుత్వం నుండి తొలుత ఆర్థిక సాయం తీసుకున్నప్పటికీ, భవిష్యత్తులో ప్రభుత్వ సాయం లేకుండా వీటిని నడిపించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. సంస్థల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చే నిధులకు తోడుగా, ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న వారు చేయూత ఇవ్వవచ్చన్నారు. సంస్థ అవసరాల కోసం ఔట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగులను నియమించుకుంటామని, తక్కువ ఖర్చుతో సంస్థను ప్రగతిపథంలో నడపాలన్నదే తమ ఉద్దేశమన్నారు. అర్చకులు, పురోహితులు తదితర వైద్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వివరించారు.
సుధామ ఎండోమెంట్ స్కీం
శ్రీకృష్ణ సుధామ ఎండోమెంట్ స్కీం పేరుతో సరికొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నామని కృష్ణారావు తెలిపారు. వ్యక్తిగతంగా ఇచ్చే నిధులను సామాజిక అవసరాలకోసం ధాతల అభీష్టం మేరకు వ్యయం చేస్తామన్నారు. సామాజిక అవసరాలైన కమ్యూనిటీ హాల్, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం తదితర అవసరాలకు ఏ ప్రాంత నుండి ఈ కమ్యూనిటీకి చెందిన వారు 50 శాతం నిధులను వ్యయం చేస్తే, సంస్థ మరో 50 శాతం నిధులను భరిస్తుందని చెప్పారు.