బిజినెస్

సింగరేణిలో సౌర విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: సింగరేణి అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను సంబంధించి నిర్మాణ ప్రక్రియలను మరింత వేగవంతం చేయాలని సింగరేణి సిఎండి ఎన్ శ్రీ్ధర్ అధికారులను ఆదేశించారు. తొలి దశగా 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం ఏడాదిలోపుగా పూర్తి చేసేందుకు ప్రత్యేక చొరవ చూపాలని ఆయన ఇక్కడ సింగరేణి విద్యుత్ విభాగంతో జరిపిన సమీక్షలో పేర్కొన్నారు. సింగరేణి అన్ని ప్రాంతాల్లో సొలార్ థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసి తద్వరా 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఇప్పటి వరకు తీసుకున్న దశల వారీగా చర్యలపై ఆయన చర్చించారు. ప్లాంట్‌ల ఏర్పాటుకు కావాల్సిన భూములను గుర్తించడంపై సమీక్షించడంపై సమీక్షిస్తూ తొలి దశగా కనీసం 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు మరింత వేగవంతంగా చర్యలు తీసుకోవాలన్నారు. థర్మల్ విద్యత్ కేంద్రాన్ని లాభదాయకంగా నిర్వహించాలని, ప్రస్తుత ప్లాంట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న స్టీగ్ ఇంటర్నేషనల్ సంస్ధ విదేశీనిపుణులను ఇక్కడికి రప్పించి మెరుగైన నిర్వహణకు తగిన సలహాలు తీసుకోవాలని కోరారు. జాతీయ స్థాయిలో అత్యధికంగా 4వ స్థానం సాధించిన ఎన్‌టిపిసితో సమానంగా పిఎల్‌ఎఫ్‌ను సాధించాలన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు ఎస్‌ఎం ఎస్ శంకర్, ఇడి సంజయ్ సూర్ తదితరులు పాల్గొన్నారు.