రాష్ట్రీయం

కదిలిన ఐపీఎస్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 11: రాష్ట్రంలో 38 మంది ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో డైరక్టర్ జనరల్ హోదాలో ఉన్న టి.కృష్ణప్రసాద్ రైల్వేపోలీస్ డీజీగా కొనసాగుతూ రోడ్డు భద్రత సంస్థ బాధ్యతలను అదనంగా చూస్తున్నారు. ఈ బదిలీల్లో కృష్ణప్రసాద్‌ను రోడ్డు భద్రత సంస్థ డీజీగా బదిలీ చేసి పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టింగ్ కోసం వేచి ఉన్న అదనపు డీజీ సంతోష్ మెహ్రాకు తెలంగాణ పోలీస్ అకాడమి డైరక్టర్‌గా పోస్టింగ్ లభించింది. శాంతిభద్రతల విభాగం అదనపు డీజీగా ఉన్న అంజనీకుమార్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా, అదనపుడీజీ (ఆర్గనైజేషన్)గా ఉన్న ఎం.గోపికృష్ణను ఫైర్‌సర్వీసెస్ డీజీగా నియమిస్తూ, అక్కడ ఉన్న రాజీవ్త్రన్‌ను ఆర్గనైజేషన్ అదనపు డీజీగా బదిలీ చేసింది. శాంతిభద్రల విభాగం అదనపు డీజీగా పోలీస్ అకాడమి డైరక్టర్‌గా ఉన్న జితేందర్‌ను నియమించింది. రైల్వే పోలీస్ అదనపు డీజీగా సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్యను నియమించగా, వెల్ఫేర్ అదనపు డీజీగా ఉన్న సౌమ్యామిశ్రాను ఆ పోస్టు నుంచి రీలీవ్ చేసింది. సిఐడిలో ఐజీగా ఉన్న షికాగోయల్‌ను హైదరాబాద్ నగర అదనపు సీపీ (క్రైం)గా బదిలీ చేసి అక్కడ ఉన్న స్వాతిలక్రాను శాంతిభద్రతల విభాగం ఐజీగా బదిలీ చేస్తూ జివో జారీ చేసింది. ఇంకా హైదరాబాద్ ఇన్‌చార్జి సిపిగా పని చేసిన వివి శ్రీనివాసరావును తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా బదిలీ చేసింది. పోస్టింగ్ కోసం వేచి ఉన్న అనిల్‌కుమార్‌ను హైదరాబాద్ సిటీ అదనపు సీపీ ట్రాఫిక్‌గా పోస్టింగ్ ఇవ్వగా, స్పెషల్ ఇంటిలిజెన్స్‌లో ఉన్న విసి సజ్జన్నార్‌ను సైబరాబాద్ సీపీగా బదిలీ చేసింది. పోస్టింగ్ కోసం వేచి ఉన్న దేవేందర్‌సింగ్ చౌహాన్‌ను హైదారాబాద్ సిటీ శాంతిభద్రతల అదనపు సీపీగా పోస్టింగ్ లభించింది. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్‌గా ఉన్న టివి శశిధర్‌రెడ్డి పోలీస్ అకాడమి అదనపు డైరక్టర్‌గా, వరంగల్ సిటీ కమిషనర్‌గా ఉన్న జి.సుధీర్‌బాబు రాచకొండ జాయింట్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. పోస్టింగ్ కోసం వేచి ఉన్న డిఐజీ సి రవివర్మను సిఐడి డిఐజిగా పోస్టింగ్ ఇవ్వగా, ఎస్‌ఐబి డిఐజిగా టి.ప్రభాకరరావును బదిలీ చేసింది. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ సీపీగా ఉన్న వి.రవీందర్‌ను వరంగల్ సీపీగా, రాచకొండ జాయింట్ సీపీగా ఉన్న తరుణ్‌జోషిని ఎస్‌పీ ర్యాంక్ నుంచి డిఐజీగా పదోన్నతి కల్పించి హైదరాబాద్ సిటీ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ సిపిగా బదిలీ చేసింది. సిద్దిపేట కమిషనర్‌గా ఉన్న వి.శివకుమార్‌ను ఇంటిలిజెన్స్ ఎస్పీగా, హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీగా ఉన్న ఎ.వెంకటేశ్వరరావును మాదాపూర్ జోన్ డీసీపీగా బదిలీ చేసి అక్కడ ఉన్న పి.విశ్వప్రసాద్‌ను హైదరాబాద్ సిటీ సెంట్రల్ జోన్ డీసీపీగా బదిలీ చేసింది. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ఉన్న ఎఆర్ శ్రీనివాస్‌ను హైదరాబాద్ సిటీ వెస్ట్‌జోన్ డీసీపీగా, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా ఉన్న ఎం.రమేష్‌ను హైదరాబాద్ సిటీ ఈస్ట్‌జోన్ డీసీపీగా, అక్కడ ఉన్న సి.శశిధర్‌రాజును చీఫ్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పోస్టింగ్ కోసం వేచి ఉన్న ఎస్పీ ఆర్.రమారాజేశ్వరిని జోగులాంబ గద్వాల్ జిల్లా ఎస్పీగా, సిద్దిపేట కమిషనర్‌గా జోయల్ డెవిస్‌ను బదిలీ చేసింది. జోగులాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ ఎస్.ఎం.విజయ్‌కుమార్‌ను గ్రౌహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా, జగిత్యాల ఎస్పీ బి.అనంత్‌శర్మను పోలీస్ అకాడమి డిప్యూటీ డైరక్టర్‌గా, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ విశ్వజీత్‌ను విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్‌గా, ఏటూరునాగారం ఎఎస్పీ బికె రాహుల్ హెగ్డేను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎఎస్పీగా బదిలీ అయ్యారు. భద్రాచలం ఎఎస్పీ సునీల్ దత్‌ను జగిత్యాల ఎఎస్పీగా, గోదావరి ఖని ఎఎస్పీ అపూర్వారావును సిఐడి ఎఎస్పీగా, పోస్టింగ్ కోసం వేచిఉన్న ఎఎస్పీ చేతన మైలాభూతలను హైదరాబాద్ సిటీ సుల్తాన్‌బజార్ ఎసిపిగా, పోస్టింగ్ కోసం వేచి ఉన్న ఎఎస్పీ రక్షితా కె.మూర్తిని గోదావరి ఖని ఎఎస్పీగా, పోస్టింగ్ కోసం వేచి ఉన్న పాటిల్ సంగ్రమ్ సింగ్ గనాపాత్రోకు భద్రాచలం ఎఎస్పీగా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.