రాష్ట్రీయం

చత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*నలుగురు మహిళలతో సహా ఆరుగురు మావోయిస్టులు హతం
బద్రాచలం/చింతూరు : దండకారణ్యంలో మావోయిస్టులపై పోలీసులు ఆధిపత్య దిశగా అడుగులు వేస్తున్నారు. సరిహద్దు అటవీ ప్రాంతంలో కూంబింగ్ విస్తృతంగా చేపడుతూ మావోయిస్టులను మట్టుబెడుతున్నారు. మొన్న సుకుమా జిల్లాలో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు హతమార్చారు. ఈనేపధ్యంలో చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ దండకారణ్యంలో ఆదివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. సంఘటనా స్థలంలో నలుగురు మహిళా నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన ఇద్దరి మృతదేహాల కోసం పోలీసు బలగాలు వెతుకుతున్నాయి.