Others
విజయ పవనాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 3 December 2018
- డా. డి.వి.జి. శంకరరావు, 9440836931
కటిక చీకటి తెరల వెనుక
స్ఫటిక వేకువలు కానరావాలి
ఎడారి దారుల మజిలీలో
తడియారని ఆశలు తొణికిసలాడాలి
నిరాశ వృక్షపు ఛాయల్లో
మానవ వికాసపు గుర్తులు చూడాలి
మిత్రమా -
హృదయానికి ఓపిక ఉంటే
ఉదయాలు ఎదురై రాక మానవు
పయనమెందుకో జ్ఞాపకముంటే
విజయ పవనాలు నిను తాకక మానవు