తెలంగాణ

సైరా సెట్‌లో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రముఖ నటుడు చిరంజీవి నటిస్తున్న సైరా సెట్‌లో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో ఎవ్వరూ లేకపోవటంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట శివారులో ఉన్న చిరంజీవి ఫామ్‌హౌజ్‌లో సెట్ వేసి సినిమా చిత్రీకరణ నిర్వహిస్తున్నారు. తెల్లవారు జామున దట్టమైన పొగ, మంటలు రావటంతో స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. ఈ ప్రమాదం వల్ల దాదాపు మూడు కోట్ల రూపాయల నష్టం సంభవించింది. కాగా ఈరోజు సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సిన బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ తన షూటింగ్‌ను రద్దుచేసుకున్నారు.