సంపాదకీయం

ఉన్మాద వ్యూహం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ కశ్మీర్‌లో స్వజాతీయులపై పాకిస్తాన్ ఉసిగొల్పుతున్న జిహాదీ బీభత్సకారులు జరుపుతున్న దాడుల గురించి దేశంలోని అధికాధిక రాజకీయ పక్షాలు, స్వచ్ఛంద సంస్థలు పట్టించుకోవడం లేదన్న కఠోర వాస్తవానికి ఇది మరో ఉదాహరణ. మాధ్యమాలలో సైతం ఈ దాడులకు తగినంత ప్రచారం లభించడం లేదన్న దానికి సైతం ఇది మరో నిదర్శనం. ‘్భరతీయ జనతాపార్టీ’ జమ్మూ కశ్మీర్ ప్రాంతీయ విభాగం కార్యదర్శి అనిల్ పరిహార్‌ను గురువారం జిహాదీ బీభత్సకారులు హత్య చేశారు. పరిహార్ సోదరుడైన అజిత్ పరిహార్‌ను కూడ టెర్రరిస్టులు కాల్చి చంపారు. దేశంలోని అనేక ప్రధాన రాజకీయ పక్షాల ప్రముఖులు ఈ బీభత్సకాండను నిరసించక పోవడం క్రూరమైన నిర్లక్ష్యానికి నిదర్శనం. మాధ్యమాలలో సైతం ఈ పైశాచిక కాండ గురించి జరుగవలసిన స్థాయిలో ప్రచారం కావడం లేదు. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించ వలసిందిగా జిహాదీలు ‘పిలుపుల’నిచ్చారు. జిహాదీ బీభత్సకాండను సమర్ధిస్తున్న ‘హురియత్’ ముఠాలు కూడ ఎన్నికలలో వోట్లు వేయరాదని ప్రజలను కోరాయి. జమ్మూ కశ్మీర్‌లోని ప్రధాన ప్రాంతీయ పక్షాలు- నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ- ఈ ‘జిహాదీ’ పిలుపులను మన్నించాయి, గౌరవించాయి, శిరసా వహించాయి, ఎన్నికలను బహిష్కరించాయి. జాతీయ పక్షాలైన ‘్భజపా’ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థులుగా ఈ ఎన్నికలు జరిగాయి. ‘్భజపా’కు కాంగ్రెస్ కంటె ఎక్కువ స్థానాలు లభించాయి. తమ ‘పిలుపుల’ను లెక్కపెట్టకుండా ఎన్నికలలో వోట్లు వేసిన ప్రజలను భయవిభ్రాంతికి గురిచేయడానికై ‘జిహాదీ’లు ఎన్నికల సమయంలోను, ఎన్నికలు ముగిసిన తరువాత కూడ బీభత్స కలాపాలను ఉద్ధృతం చేయడం కొనసాగుతున్న వైపరీత్యం. అందువల్ల భద్రతా దళాలవారు కూడ మరింత అప్రమత్తమయ్యారు. అయినప్పటికీ ‘జిహాదీ’లు నిరంతరం భద్రతా దళాలతో తలపడుతుండడం పాకిస్తాన్ ఉసిగొల్పుతున్న బీభత్సం మరింత వికృతరూపం దాల్చిందనడానికి సాక్ష్యం. అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన- ఒకేరోజున-ఏడుగురు పౌరులను, నలుగురు కేంద్రీయ పోలీసులను టెర్రరిస్టులు పొట్టనపెట్టుకోవడం దాడుల తీవ్రతకు సాక్ష్యం. గురువారం ‘్భజపా’ప్రాంతీయ కార్యదర్శిని, ఆయన సోదరుడిని కాల్చి చంపడం పరాకాష్ఠ..
మన దేశం బ్రిటన్ విముక్తమైన నాటి నుంచి పాకిస్తానీ జిహాదీలు, పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత స్థానిక జిహాదీలు మన దేశంలో బీభత్సకృత్యాలను నిర్వహిస్తున్నారు. 1947 అక్టోబర్‌లో పాకిస్తానీ జిహాదీలు జమ్మూ కశ్మీర్‌లో చొరబడి స్వజాతీయ హైందవ మతాల వారిని ఊచకోత కోశారు. ప్రత్యక్ష జిహాదీలతోపాటు ‘ప్రచ్ఛన్న జిహాదీలైన’ పాకిస్తాన్ సైనికులు కూడ కశ్మీర్‌లోకి చొరబడిపోవడం చరిత్ర. ఈ దాడుల ఫలితంగా ప్రస్తుతం పాకిస్తాన్ అక్రమ అధీనంలో ఉన్న జమ్మూ కశ్మీర్ నుంచి హిందువులు లక్షల సంఖ్యలో నిర్వాసితులయ్యారు. వేల మంది హత్యలకు గురికాగా మిగిలినవారు జమ్మూ ప్రాంతంలోకి, దేశంలోని ఇతర ప్రాంతాలలోకి వలస వచ్చేశారు. ఈ జిహాదీ కాండ ఫలితంగానే 1947 నుంచీ కూడ జమ్మూ కశ్మీర్‌లోని దాదాపు ఎనబయి మూడువేల చదరపు కిలోమీటర్ల భూభాగం ఇప్పటికీ పాకిస్తాన్ అక్రమ అధీనంలో కొనసాగుతోంది. ఇలా పాకిస్తాన్ అక్రమ అధీనంలోఉన్న కశ్మీర్‌లో సర్వమత సమభావ వ్యవస్థ ధ్వంసమైపోయింది. ఎందుకంటె ఈ ప్రాంతంలో ‘ఇస్లాం’ను ఏకైక మతంగా జిహాదీలు ప్రతిష్ఠించారు.. ఇలా పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లో హిందువులను నిర్మూలించిన ‘జిహాదీలు’ రెండవ దశలో తమ బీభత్సకాండను కశ్మీర్ ‘లోయ’ ప్రాంతంలో కేంద్రీకరించారు. 1947 సంవత్సరం నాటికి ‘లోయ’ప్రాంతంలోని జనాభాలో ఇరవై మూడు శాతం హిందువులు. 1990 నాటికి జిహాదీలు ఈ హిందువులలో అత్యధికులను హత్యచేశారు, వెళ్లగొట్టారు. 1989లో మరోసారి పెద్దఎత్తున ‘జిహాదీలు’ దాడులు చేశారు. ఫలితంగా ‘లోయ’లోని అవశేష హిందువులు నిశే్శషమయ్యారు. ఇలా మొదటి దశలో పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లోను, రెండవ దశలో కశ్మీర్ లోయలోను హిందువులను నిర్మూలించగలిగిన జిహాదీ ముష్కరులు 1990వ దశకం నుంచి ‘మూడవ దశ’ బీభత్సకాండను కొనసాగిస్తున్నారు.
భారత సైనిక దళాలపై దాడులు చేయడం, జమ్మూ ప్రాంతంలోని హిందువులను హత్యచేయడం ఈ మూడవ దశ. జమ్మూ ప్రాంతపు జనాభాలో హిందువులు అధిక సంఖ్యాకులు. దాడులు చేయడం ద్వారా, చంపడం ద్వారా, వెళ్లగొట్టడం ద్వారా ఇస్లాంలోకి బలవంతంగా మతం మార్చడం ద్వారా ఇస్లామేతర మతాలవారిని నిర్మూలించడం ‘జిహాదీ’ల లక్ష్యం. ఇస్లాం మతం పుట్టిన నాటినుంచి ‘జిహాద్’ కొనసాగుతోంది. ‘జిహాదీ’ల హత్యాకాండతోను, ఇస్లామేతరులను నిర్మూలించి ప్రపంచమంతటా ఇస్లాంను ఏకైక మతంగా స్థాపించాలన్న ఉన్మాద లక్ష్యంతోను సామాన్య ముస్లింలకు సంబంధం లేదు. సామాన్య ముస్లింలలో అత్యధికులు సర్వమత సమభావాన్ని వాంఛిస్తున్నారు, సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థలు పరిఢవిల్లాలని కోరుకుంటున్నారు. కానీ ఇస్లాం మతస్థులు అధికంగా ఉన్నచోట ‘జిహాదీ’లు ఇస్లామేతర అల్పసంఖ్యాకులను నిర్మూలించడం చరిత్ర ధ్రువపరచిన వాస్తవం! కశ్మీర్ లోయలోను, పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్- పిఓకె-లోను హిందువులు సర్వ సమగ్రంగా నిర్మూలనకు గురికావడం ఇందుకు సాక్ష్యం! మన దేశంలో అనాదిగా అనేక మతాలవారు జీవిస్తున్నారు. స్మార్త, శైవ, వైష్ణవ, శాక్త, సౌర, గాణాపత్య, స్కాంద మతాలు వేద విజ్ఞానం ప్రాతిపదిక పరిఢవిల్లిన మతాలు. బౌద్ధం, జైనం వంటి అవైదిక మతాలు కూడ ఈ దేశంలో ప్రభవించాయి. ఇటీవలి కాలంలో సిక్కుమతం, ఆర్యసమాజం వంటి మతాలు పుట్టాయి. విదేశాల నుంచి మతాలు వ్యాపించాయి కూడా. కానీ అనాదిగా ఈ దేశపు జాతీయత- వౌలిక సాంస్కృతిక అస్తిత్వం- ఏ ఒక్క మతానికి మాత్రమే పరిమితం కాలేదు. సర్వమత సమానత్వం ప్రాతిపదికగా సర్వమతాల, సర్వ వైవిధ్యాల సమాహారంగా భారత జాతీయత లేదా హైందవ జాతీయత యుగాలుగా వికసిస్తోంది, పరిమళిస్తోంది. ఈ సర్వమత సమభావ స్వభావానికి ఆధునిక ధ్రువీకరణ భారత రాజ్యాంగం...
కానీ ఈ సర్వమత సమభావ స్వభావాన్ని, ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉన్న చోటల్లా ‘జిహాదీ’ విధ్వంసం చేస్తున్నారు. దేశ విభజన తరువాత సనాతన జాతీయులైన హైందవ మతాలవారు అధికంగా ఉన్న ‘అవశేష భారత్’లో సర్వమత సమభావ వ్యవస్థ పరిఢవిల్లుతోంది. కానీ ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యాకులైన పాకిస్తాన్‌లో మాత్రం అనాదిగా జీవించిన స్వజాతీయ మతాల వారిని నిర్మూలించడం చరిత్ర.. ఇలా పాకిస్తాన్‌లో ‘అల్పసంఖ్యాకుల’ను నిర్మూలించిన ‘జిహాదీ’లు ‘దురాక్రమిత కశ్మీర్’లోను కశ్మీర్ లోయలోను అదే పనిచేశారు! కానీ మతోన్మాద దాహం చల్లారలేదు, చల్లారదు. అందువల్లనే ‘జమ్మూ’ ప్రాంతంలో జిహాదీలు విస్తరించారు, విస్తరిస్తున్నారు. ‘్భజపా’ నాయకుడిని, అతని సోదరుడిని చంపివేయడం ఈ జిహాదీ విషవ్యూహ విస్తరణలో భాగం! ప్రభుత్వాల వైఫల్యం ఈ ‘విస్తరణ’కు కారణం. దేశమంతటా పరిఢవిల్లుతున్న ‘సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ’ పాకిస్తాన్ అక్రమ అధీనంలోని కశ్మీర్‌లోను, కశ్మీర్ లోయలోను ఎందుకు భగ్నమైంది? అన్న విషయమై ప్రభుత్వాలు, రాజకీయ పక్షాల వారు, మేధావులు, మాధ్యమాల వారు సమాధానం చెప్పగలగాలి.. అంతరంగ ‘మధనం’ జరగాలి!